కొత్త ఏడాది ఆరంభంలో బ్యాటర్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఓ గుడ్‌న్యూస్ అందించింది. స్టంపౌట్ రూల్ విషయంలో ఐసీసీ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు వికెట్ కీపర్ స్టంపింగ్‌కు అప్పీలు చేసినప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ రిఫర్ చేసేవారు. థర్డ్ అంపైర్ తొలుత క్యాచ్(ఆల్‌ట్రా ఎడ్జ్)ను చెక్ చేసి.. ఆ తర్వాత స్టంప్ ఔటా కాదాన్నది పరిశీలించి తన నిర్ణయాన్ని వెల్లడించేవాడు. అయితే ఇకపై ఈ రూల్ అంతర్జాతీయ క్రికెట్‌లో మరి కన్పించదు.
ఐసీసీ కొత్త రూల్ ప్రకారం.. ఫీల్డ్ అంపైర్‌లు స్టంపౌట్‌కు రిఫర్ చేస్తే, థర్డ్ అంపైర్ కేవలం స్టంపింగ్‌ను మాత్రమే చెక్ చేయాలి. అంతే తప్ప బంతి బ్యాట్‌కు తాకిందా లేదన్నది పరీశిలించాల్సిన అవసరం లేదు. ఫీల్డింగ్ జట్లు పాత నిబంధనను ఎక్కువ ఊపయోగించకోవడంతో ఐసీసీ ఈ తరహా మార్పులు చేసింది. ఈ రూల్ గతేడాది డిసెంబర్ 12 నుంచే అమలు లోకి వచ్చినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment