2015కు ఐసీసీ జట్ల ప్రకటన
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతి ఏటా టెస్టులకు, వన్డేలకు జట్లను ప్రకటిస్తుంది. ఏడాది మొత్తం నిలకడగా ఆడిన ఆటగాళ్లకు ఇదో గుర్తింపు. అయితే ఈ ఏడాది ఈ జట్లలో భారత్ నుంచి పేసర్ మొహమ్మద్ షమీకి వన్డే జట్టులో చోటు లభించింది. టెస్టుల్లో అశ్విన్ 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ జట్లను ఎంపిక చేస్తుంది. ఆశ్చర్యకరంగా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్‌కు వన్డే జట్టులో చోటు దక్కింది.
ఐసీసీ టెస్టు జట్టు: కుక్ (కెప్టెన్), రూట్, బ్రాడ్ (ఇంగ్లండ్), వార్నర్, స్మిత్, హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా), విలియమ్సన్, బౌల్ట్ (న్యూజిలాండ్), సర్ఫరాజ్, యాసిర్ షా, యూనిస్ ఖాన్ (పాకిస్తాన్), అశ్విన్ (12వ ఆటగాడు).
ఐసీసీ వన్డే జట్టు: డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), సంగక్కర, దిల్షాన్ (శ్రీలంక), స్టీవ్ స్మిత్, స్టార్క్ (ఆస్ట్రేలియా), రాస్ టేలర్, బౌల్ట్ (న్యూజిలాండ్), షమీ (భారత్), ముస్తాఫిజుర్ (బంగ్లాదేశ్), రూట్ (12వ ఆటగాడు).