అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..! | Maid Diagnoses Disease In 10 Seconds Doctor Fails To Detect | Sakshi
Sakshi News home page

అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..! షాక్‌లో వైద్యుడు

Published Fri, Jun 14 2024 3:46 PM | Last Updated on Fri, Jun 14 2024 3:59 PM

Maid Diagnoses Disease In 10 Seconds Doctor Fails To Detect

అతనొక అనుభవజ్ఞుడైన డాక్టర్‌ అయినప్పటికీ తన కుటుంబంలోని వ్యక్తికి వచ్చిన వ్యాధి ఏంటన్నది నిర్థారించలేకపోయాడు. పలు టెస్టులు చేసి ఆ వ్యాధి ఏంటనేది చెప్పలేకపోయాడు. కానీ ఆ వ్యాధి ఏంటనేది..అతడి ఇంట్లో పనిచేసే పనిమనిషి జస్ట్‌​ 15 సెకన్లలో ఠక్కున చెప్పేసింది. ఆమె సమయస్ఫూర్తికి విస్మయానికి గురైన డాక్టర్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నారు. ఇంతకీ ఆ పనిమనిషి ఎలా చెప్పిందంటే...

డాక్టర్‌ ఫిలిప్స్‌ తన కుటుంబంలోని ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. విపరీతమైన చలి, కీళ్లనొప్పులు, దగ్గుతో బాధపడ్డాడు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా వచ్చాయి. దీంతో ఫిలిప్స్‌ కోవిడ్‌ 19, ఇన్ఫ్లుంజా, డెంగ్యూ వంటి వైద్య పరీక్షలన్నీ చేశాడు. కానీ ఆ వ్యక్తికి ఏం వ్యాధి వచ్చేందని నిర్థారించలేకపోయాడు. దీంతో అతనికి సరైన అందిచలేకపోయాడు. అసలు అతనకు వచ్చిన సమస్య ఏంటర్రా బాబు అంటు తలపంటుకున్నాడు.

 అప్పుడే వచ్చిన పనిమినిషి ఆ వ్యక్తికి వచ్చింది 'ఆంజంపి'ని అనే వ్యాధి అని స్థానిక భాషలో చెప్పింది. ఇది తన మనవళ్లకు వచ్చిందని, వారిలో ఈ లక్షణాలు చూశానని అంది. వెంటనే పనిమినిషి చెప్పిన వ్యాధికి సంబంధించిన పార్వోవైరస్‌ బీ19 అనే వైద్య పరీక్షలు చేశారు డాక్టర్‌ ఫిలిప్స్‌. చివరికి ఆమె చెప్పిందే నిజమయ్యింది. ఆ వ్యక్తికి వచ్చిన వ్యాధిని వైద్య పరిభాషలో రిథీమా ఇన్ఫెక్టియోసమ్ అని పిలుస్తారు. ఇది హ్యుమన్‌ పార్వోవైరస్‌ బీ19 వల్ల కలిగే వైరల్‌ ఇన్ఫెక్షన్‌. ఇది పిల్లలను బాగా ప్రభావితం చేస్తుంది. 

ఇది దగ్గినప్పుడూ, తుమ్మినప్పుడూ శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బుగ్గలపై వచ్చే ఎరుపు దద్దర్లను స్లాప్డ్‌ చీక్‌ సిండ్రోమ్‌ అని పిలుస్తారు. ఈ దద్దర్లు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. ఈ మేరకు సదరు డాక్టర​్‌ ఫిలిప్స్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ..17 ఏళ్ల వైద్య అనుభవం ఆ వ్యాధిని నిర్థారించలేదు. కేవలం పది సెకన్లలో ఆ వ్యాధి ఏంటో చెప్పగలిగిన తన పనిమినిషి ముందు తన అనుభవం కూడా సరిపోలేదని అన్నారు. అయితే నెటిజన్లు జనరల్‌ ప్రాక్టీషనర్‌(జీపి)ని ఎందుకు సంప్రదించలేదని వైద్యుడిని ప్రశ్నించగా..ఈ రోజుల్లో జీపీ ఆశించిన స్థాయిలో నిర్థారించడ లేదని అన్నారు. తనకు తన పనిమనిషి వ్యాది నిర్థారణ విలువైనదని, అందువల్లే ఒక రోజు సెలువు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదని అని సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

(చదవండి: జీ7 సదస్సులో మోదీకి భారతీయ వంటకాలను అందించే రెస్టారెంట్‌ ఇదే..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement