ధోనీ ప్రపంచ రికార్డు
మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంప్ అవుట్లు చేసిన కీపర్గా ధోనీ (134) సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ధోనీ.. మిచెల్ జాన్సన్ను స్టంప్ అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. దీంతో శ్రీలంక ఆటగాడు సంగక్కర (133) పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది. ధోనీ టెస్టుల్లో 38, వన్డేల్లో 85, టి-20ల్లో 11 స్టంప్ అవుట్లు చేశాడు.