శిఖర్ ధావన్, స్పిన్నర్ అశ్విన్
సాక్షి, బెంగళూరు: పది సీజన్లు ముగించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదకొండో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రారంభించింది. క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను రెకెత్తిస్తున్న ఈ వేలంలో తొలి ఆటగాడిగా ఉన్న శిఖర్ ధావన్‌ను పాత జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఈ వేలంలో ముంబై ఇండియన్స్, పంజాబ్, సన్‌రైజర్స్ జట్లు పోటీపడగా చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.5.2 కోట్లకు ధావన్‌ను కొనుగోలు చేసి ధావన్‌పై నమ్మకాన్ని ఉంచింది.
నిషేధం విదించక ముందు వరకు 8 సీజన్ల వరకు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన స్టార్ స్పిన్నర్ అశ్విన్‌ను ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. వేలంలో 7.6 కోట్ల భారీ ధరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్లు అశ్విన్ కోసం ఆసక్తి చూపాయి. అయితే సెహ్వాగ్ సూచనతో ప్రీతి జింతా అశ్విన్‌ను కొనుగోలు చేసి విలువైన ఆటగాడిని పంజాబ్‌కు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment