సాక్షి, ఢిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే స్టార్స్‌కి కాస్త సమయం దొరికినట్లయ్యింది. ఈ క్వాలిటీ టైంని కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అతడి సతీమణి అయేషాతో కలిసి బాలీవుడ్ క్లాసిక్ సాంగ్‌ను రిక్రియేట్ చేస్తూ డ్యాన్స్ చేశారు. టేబుల్ టెన్నిస్ రాకెట్లు, పింగ్ పాంగ్ బంతినే ప్రాపర్టీస్‌గా వాడుతూ భార్యాభర్తలిద్దరూ ‘హమ్జోలి’ చిత్రంలోని ‘జానే దో జానా హై’ పాటకు స్టెప్పులేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శిఖర్ ధావన్ ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ‘హమ్జోలి’ చిత్రంలోని ఈ ఒరిజినల్ పాటలో నటుడు జితేంద్ర, నటి లీన్ చందవర్కర్ బ్యాడ్మింటన్ ఆడుతూ సాగుతుంది ఈ పాట. శిఖర్ ధావన్ దంపతులు కూడా సేమ్ సీన్ రీ క్రియేట్ చేస్తూ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment