భారత్‌లో 5జీ వినియోగదార్లు డేటాను విరివిగా వాడుతున్నారు. 4జీ వినియోగదార్లతో పోలిస్తే ఏకంగా 3.6 రెట్ల డేటాను వాడుతున్నట్లు టెలికాం గేర్ తయారీ కంపెనీ నోకియా తన నివేదికలో పేర్కొంది.
టెలికం వినియోగదారులకు సేవలందించేందుకు కంపెనీలు నిత్యం కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా అక్టోబరు 2022లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2023లో మొత్తం డేటా రద్దీలో 15 శాతం వాటా 5జీదేనని ఆ నివేదికలో తెలిపింది. నివేదికలోని కొన్ని ప్రధానంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
5జీ అందుబాటులోకి వచ్చాక ఆ టెక్నాలజీ కొన్నిసార్లు వాడకపోయినా 5జీ మొబైళ్లను కొనుగోలు చేస్తున్నారు. 4జీ డివైజెస్ సంఖ్యతో పోలిస్తే 17 శాతం మేర 5జీ మొబైళ్లు వాడుతున్నారు. అంటే 79.6 కోట్లలో వీటి వాటా 13.4 కోట్లుగా ఉంది. భారత్‌లో డేటా వినియోగం గతేడాదితో పోలిస్తే 20% వృద్ధితో నెలకు 17.4 ఎక్సాబైట్స్‌గా నమోదవుతోంది. 1 ఎక్సాబైట్ 100 కోట్ల జీబీకి సమానం. సగటున ఒక్కో వినియోగదారు నెలకు 24 జీబీ వాడుతున్నారు. అంటే భారత్‌లో డేటా వినియోగం చాలా భారీగా ఉంది. మొత్తం మొబైల్ డేటా రద్దీలో 20 శాతం వాటాకు ఇది చేరింది.
ఇదీ చదవండి..హైదరాబాద్‌లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం
Comments
Please login to add a commentAdd a comment