
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌కి 4జీ స్పెక్ట్రం కేటాయించే అంశం పరిశీలనలో ఉందని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. 4జీ/ఎల్‌టీఈ సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా (ఢిల్లీ, ముంబై మినహా) 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఒక్క 5 మెగాహెట్జ్ స్లాట్ కేటాయించాలని బీఎస్‌ఎన్‌ఎల్ కోరినట్లు లోక్‌సభకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి వివరించారు. అలా కుదరని పక్షంలో చెల్లింపు ప్రాతిపదికన ఏడాది వ్యవధికి తాత్కాలికంగా 2100 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 5 మెగాహెట్జ్ స్లాట్‌నైనా కేటాయించాలని సంస్థ విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
కంపెనీ ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. మరోవైపు, మొబైల్ సర్వీసులతో పాటు స్మార్ట్ సిటీలకు అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాలు, యాప్స్‌ను అందించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ యోచిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment