జాబిల్లిపై వొడాఫోన్‌ 4జీ సేవలు | Vodafone And Nokia Plans To Establish 4g Technology On Moon | Sakshi
Sakshi News home page

జాబిల్లిపై వొడాఫోన్‌ 4జీ సేవలు

Published Thu, Mar 1 2018 9:41 PM | Last Updated on Thu, Mar 1 2018 9:41 PM

Vodafone And  Nokia Plans To Establish 4g Technology On Moon - Sakshi

బెర్లిన్‌: జియో వచ్చిన తర్వాత ఇప్పడంతా 4జీ సేవలను వినియోగిస్తున్నారు. ఇప్పుడు మారుమూల గ్రామాలకు కూడా 4జీ నెట్‌వర్క్‌ విస్తరించింది. అయితే ఈ 4జీ నెట్‌వర్క్‌ను ఏకంగా చంద్రమండలానికే విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాబిలిపై కూడా 4జీ నెట్‌వర్క్‌ను సిద్ధం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై నడిచి.. దాదాపు 50ఏళ్ల పూర్తవుతున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది చంద్రునిపై 4జీ కవరేజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జర్మనీకి చెందిన దిగ్గజ టెలికాం సంస్థ వొడాఫోన్‌ సన్నాహాలు చేస్తోంది.

టెక్నాలజీ పార్ట్‌నర్‌గా నోకియాతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ప్రైవేట్‌ రంగంలో బెర్లిన్‌కు చెందిన పీటీ  స్పేస్‌ కంపెనీ సైంటిస్టుల సహకారంతో వొడాఫోన్, నోకియా ప్రైవేట్‌ భాగస్వామ్యంతో తొలిసారి చందమామపై ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మిషన్‌ మూన్‌లో భాగంగా 2019లో కేప్‌ కెనవరాల్‌ నుంచి స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా ప్రయో గం చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకు ల కోసం తొలిసారి లైవ్‌–స్ట్రీమింగ్‌ ద్వారా హెచ్‌డీ వీడియోను ప్రసారం చేసి, ప్రత్యేక అనుభూతి కల్పిస్తామని కూడా వొడాఫోన్‌ చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement