ల్యాప్ మార్కెట్‌లో రిలయన్స్ జియో సరికొత్త సంచలనం సృష్టించనుంది. రూ.15వేల బడ్జెట్ ధరలో ల్యాప్ ట్యాప్‌ను విడుదల చేయనుంది. 4జీ సిమ్ కనెక్ట్ చేస్తూ లో బడ్జెట్ ల్యాప్ ట్యాప్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
జియో అధినేత ముఖేష్ అంబానీ ఇప్పటికే జియో బుక్ కోసం టెక్ దిగ్గజం క్వాల్కామ్, మైక్రోసాఫ్ఠ్‌తో చేతులు కలిపారు. ఇప్పుడు ఈ లోబడ్జెట్ ల్యాప్ ట్యాప్ చిప్ కోసం యూకేకి చెందిన ఏఆర్‌ఎం కంపెనీతో జతకట్టినట్లు..ఈ సంస్థ తయారు చేసిన చిప్‌తో విండోస్ ఓఎస్ తో పాటు మరికొన్ని యాప్స్ వినియోగించుకునే సౌలభ్యం కలగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ల్యాప్ ట్యాప్‌పై జియో ప్రతినిధులు ఇప్పుటి వరకు స్పందించలేదు.
ఈ నెలలో విడుదల
జియో సంస్థ ఈ సెప్టెంబర్ నెలలో ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జియోఫోన్ మాదిరిగానే, 5జి ఎనేబుల్డ్ వెర్షన్‌ను సైతం ఈ ల్యాప్ ట్యాప్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని తెలుస్తోంది.
జియో ల్యాప్ ట్యాప్ స్పెసిఫికేషన్‌లు
ఈ ల్యాప్ ట్యాప్‌లో జియో సొంత ఆపరేటింగ్ సిస్టం ‘జియో ఓఎస్’ ఉండనుంది. కావాల్సిన యాప్స్‌ను జియోస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కార్పొరేట్ ఉద్యోగులు వినియోగించే ట్యాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా జియో ల్యాప్‌ట్యాప్ పనిచేస్తుందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
చదవండి👉 5జీ, ఏమిటో వింత పరిణామం!
Comments
Please login to add a commentAdd a comment