సెప్టెంబరు నుంచి ఎయిర్‌సెల్ 4జీ | Aircel September to 4G | Sakshi
Sakshi News home page

సెప్టెంబరు నుంచి ఎయిర్‌సెల్ 4జీ

Published Thu, Jun 11 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM

సెప్టెంబరు నుంచి ఎయిర్‌సెల్ 4జీ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్‌సెల్ సెప్టెంబరు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 4జీ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పైలట్ కింద కేవలం ఎంటర్‌ప్రైస్ కస్టమర్లకు ఈ సేవలను అందిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని 120 పట్టణాల్లో మూడు నెలల్లో పూర్తి స్థాయి 4జీ అందుబాటులోకి తేనున్నట్టు ఎయిర్‌సెల్ సర్కిల్ బిజినెస్ హెడ్ హర్‌దీప్ జోహర్ తెలిపారు. బుధవారమిక్కడ ‘అయిదు రాష్ట్రాలు-ఒకే ధర’ పేరుతో ఉచిత రోమింగ్ పథకాన్ని ప్రకటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ రోమింగ్ పథకాన్ని ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల కు పరిమితం చేసినా, వచ్చే ఫలితాలనుబట్టి దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా ఉన్న మొబైల్ మనీ సేవలను సైతం సర్కిల్‌లో డిసెంబరుకల్లా వాణిజ్యపరంగా తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు.
 
 అయిదు రాష్ట్రాలు-ఒకే ధర..: కొత్త పథకంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళలో ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లందరికీ ఈ అయిదు రాష్ట్రాల్లో ఉచిత రోమింగ్ సౌకర్యం ఉంటుంది. అదనంగా చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితం. అన్ని ఔట్‌గోయింగ్ కాల్స్‌కు ఒక సెకనుకు ఒక పైసా చార్జీ చేస్తారు. రాష్ట్రం మారగానే ఈ పథకం దానంతట అదే వర్తిస్తుంది. ఎస్‌ఎంఎస్, పాకెట్ ఇంటర్నెట్ ప్యాక్‌లలో ఎటువంటి మార్పు ఉండదు. యదాతథంగా వాడుకోవచ్చు. కొత్త రోమింగ్ పథకం రాకతో కస్టమర్ల సంఖ్యలో 10% వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement