దేశంలో 5జీ సేవలు మొదలు అయ్యాయి. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫైజీ సేవలను ప్రారభించారు. డిజిటల్ ఇండియా నినాదం కొనసాగుతున్న వేళ.. ఇంటర్నెట్ సేవల ప్రాముఖ్యత పెరగడం, ఈ క్రమంలోనే అప్‌డేటెడ్ వెర్షన్ 5జీ భారత్‌లోకి ప్రవేశించడం విశేషం. అయితే..
సాధారణంగా ప్రతీ పదేళ్లకొకసారి కొత్తగా వైర్‌లెస్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీ వస్తుంటుంది. అలా.. 1జీ, 2జీ, 3జీ, 4జీ, 4.5జీ, 5జీ.. ఇలా వచ్చాయి. కొత్తగా ఒకటి రాగానే.. పాత జనరేషన్ టెక్నాలజీ కనుమరుగు కావడం విశేషం. కానీ, తొలి తరం వైర్‌లెస్ సెల్యూలార్ టెక్నాలజీ 1జీ, 2జీ..3జీలు వచ్చాక కూడా చాలా ఏళ్లపాటు మనుగడలో కొనసాగడం విశేషం. ఈ భూమ్మీద ఎక్కువ కాలం 1జీ సేవలు ఎక్కువ కాలం నడిచింది.. రష్యాలోనే!.
► 1980లో 1జీ వాడుకలోకి వచ్చింది. కేవలం ఆడియో ట్రాన్స్‌మిషన్స్ ఆధారిత సేవల కోసం ఇది పుట్టుకొచ్చింది. వేర్వేరు దేశాల్లో.. వేర్వేరు ప్రమాణాలు అభివృద్ధితో సేవలు అందాయి. అయితే ప్రపంచంలో చాలా చోట్ల నోర్డిక్ మొబైల్ టెలిఫోన్(NMT), అడ్వాన్స్‌డ్ మొబైల్ ఫోన్ సిస్టమ్(AMPS) వ్యవస్థలు పని చేశాయి.
► 90వ దశకం మధ్యలోనే 2జీ పుట్టుకొచ్చింది. 2000 సంవత్సరంలో పూర్తిస్థాయిలో 2జీ వాడుకతో.. 1జీ బంద్ అయ్యింది. కానీ..
► చాలా ఏళ్లపాటు 1జీ సేవలు కొనసాగాయనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు.
► ఫస్ట్ జనరేషన్ ఆఫ్ సెల్ల్యూలార్ నెట్‌వర్క్స్.. లో పవర్ రేడియో ట్రాన్స్‌మిట్టర్స్ సాయంతో ప్రత్యేకించి ఓ భౌగోళిక ప్రాంతంలో పని చేసేవి.
► ప్రపంచంలోనే ఫస్ట్ కమర్షియల్ సెల్యూలార్ నెట్‌వర్క్ 1979లో నిప్పోన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్(NTT) జపాన్‌లో ప్రారంభించింది. తొలుత మెట్రోపాలిటన్ ప్రాంతంగా టోక్యోలో ప్రారంభించారు.
► పానాసోనిక్ TZ-801 ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించిన తొలి ఫోన్. ఐదేళ్లలో ఆ నెట్‌వర్క్ జపాన్ అంతటా విస్తరించింది. అలా ప్రపంచంలో తొలి 1జీ/సెల్యూలార్ నెట్‌వర్క్ దేశంగా జపాన్ ఖ్యాతి సంపాదించుకుంది. అయితే..
► జపాన్ కంటే ముందు బెల్ లాబోరేటరీస్(నోకియా బెల్ ల్యాబ్స్) ఫస్ట్ సెల్యూలార్‌నెట్‌వర్క్‌ను నిర్మించింది.
► జపాన్ తర్వాత.. స్వీడన్, నార్వే, సౌదీ అరేబియా, డెన్మార్క్, ఫిన్లాండ్, స్పెయిన్‌లు 1జీ నెట్‌వర్క్ ద్వారా కమర్షియల్ సెల్యూలార్ నెట్‌వర్క్‌లను మొదలుపెట్టాయి.
► 90వ దశకం మధ్యనాటికి 1జీ శకం ముగిసి.. 2జీ శకం మొదలైంది. జీఎఎస్‌ఎం, సీడీఎంఏ వన్ లాంటి సెల్యూలార్ టెక్నాలజీలు వాడుకలో వచ్చాయి.
► 2000 సంవత్సరం మొదటినాటికి 1జీ నెట్‌వర్క్ దాదాపుగా కనుమరుగు అయ్యింది. అయితే.. యూరప్ తూర్పు ప్రాంతాల్లో మాత్రం 1జీ నెట్‌వర్క్‌లు కొనసాగాయి. ఇక ప్రపంచంలో చివరగా 1జీ నెట్‌వర్క్‌ను మూసేసిన దేశం రష్యా. అలా.. 2017 దాకా 1జీ నెట్‌వర్క్ తన సేవలను కొనసాగించింది.
► 0G.. జీరో జనరేషన్ సెల్యూటార్ టెక్నాలజీ. ప్రీ సెల్యూలార్ వ్యవస్థలుగా వ్యహరిస్తుంటారు. మొబైల్ రేడియో టెలిఫోన్ వ్యవస్థలు.. వైర్‌లెస్ టైప్‌గా గుర్తింపు పొందాయి. 1940 నుంచి వీటి వాడకం పెరిగింది. వైర్‌లెస్ ఫోన్‌లు, వాకీటాకీలు వీటి కిందకు వచ్చేవి.
► 2జీ.. డిజిటల్‌గా ఎన్‌క్రిప్ట్ చేయబడిన సంభాషణలతో పాటు మొబైల్ డేటా, ఎస్సెమ్మెస్ సేవల కోసం అందుబాటులోకి వచ్చింది. 1991లో జీఎస్‌ఎం స్టాండర్డ్‌తో ఫిన్లాండ్‌లో 2జీ సెల్యూలార్ టెలికామ్ నెట్‌వర్క్స్ సేవలు మొదలు అయ్యాయి. ఆపై 2.5జీ ద్వారా జీపీఆర్‌ఎస్(General Packet Radio Service), 2.75జీ ద్వారా ఎడ్జ్(Enhanced Data rates for GSM Evolution) అందుబాటులోకి వచ్చాయి.
► 3జీ.. వైర్‌లెస్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీలో మూడవతరం. వేగంగా డాటా ట్రాన్స్‌ఫర్ కోసం, బెటర్ వాయిస్ క్వాలిటీ కోసం ఉద్దేశించబడింది. 2001 ఏడాది మధ్యలో 3జీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జపాన్‌కు చెందిన NTT డోకోమో అక్టోబర్ 1వ తేదీ, 2001లో 3జీ కమర్షియల్ సేవల్ని మొదలుపెట్టింది. భారత్‌లో 2008 డిసెంబర్ 11వ తేదీన మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్(MTNL) ద్వారా 3జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 3జీలో 3.5జీ, 3.75జీ కూడా వచ్చాయి.
► 4జీ.. బ్రాడ్‌బాండ్ సెల్యూలార్ నెట్‌వర్క్ టెక్నాలజీలో నాలుగవ తరం. వైమ్యాక్స్(Wimax) ప్రమాణాలతో 2006లో దక్షిణ కొరియాలో తొలి కమర్షియల్ 4జీ సేవలు లాంఛ్ అయ్యాయి. అయితే..
► 2010 డిసెంబర్‌లో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ 4జీ నిర్వచనంలో లాంగ్ టర్మ్ ఎవల్యూషన్(LTE)ని కూడా జత చేసింది. ఎల్టీఈతో పాటు వైమ్యాక్స్, హెచ్‌ఎస్‌పీఏ+( Evolved High Speed Packet Access) ప్రమాణాలు కూడా 4జీకి జత కలిశాయి.
► 2021 నాటికి 4జీ టెక్నాలజీ ప్రపంచంలో దాదాపు 58 శాతం మార్కెట్‌ను ఆక్రమించింది.
► ఇక 5జీ విషయానికొస్తే.. 2019 నుంచే ప్రపంచవ్యాప్తంగా 5జీ సేవలు మొదలయ్యాయి.
► సౌత్ కొరియా 5జీ నెట్‌వర్క్‌ను లాంఛ్ చేసింది. ఎల్జీయూ ఫ్లస్ తప్పించి దాదాపు అన్ని కంపెనీ ఫోన్లు అక్కడ 5జీ నెట్‌వర్క్ ఆధారంగానే పని చేస్తున్నాయి.
► 2025 నాటికి.. ప్రపంచంలో 25 శాతం మొబైల్ టెక్నాలజీ మార్కెట్, 1.7 బిలియన్ సబ్‌స్క్రయిబర్స్ 5జీకే మొగ్గు చూపుతారని అంచనా ఉంది.
► 6జీ పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తిక కనబరుస్తున్నా.. అది ఇంకా ఆచరణలోకి రాలేదు. 2030 నాటికి అది ప్రపంచానికి అందుబాటులోకి రావొచ్చనేది ఒక అంచనా.
► 7G గురించి.. ఆసక్తికరమైన విషయం చర్చించుకోవాలి. ప్రపంచంలో కేవలం నార్వేలో 7జీ-8జీ స్పీడ్‌తో కొన్ని చోట్ల ఇంటర్నెట్‌ను అందిస్తున్నారు. అంటే.. సెకనుకు 11 గిగాబైట్స్ లెక్కను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. అయితే 6జీనే మనుగడ లేని టైంలో 7జీ సేవల గురించి ప్రపంచం అంతగా ఆసక్తి కనబర్చడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment