Cellular Services
-
5G ఎఫెక్ట్: 1G ఇంకా వాడుకలోనే ఉందా?
దేశంలో 5జీ సేవలు మొదలు అయ్యాయి. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫైజీ సేవలను ప్రారభించారు. డిజిటల్ ఇండియా నినాదం కొనసాగుతున్న వేళ.. ఇంటర్నెట్ సేవల ప్రాముఖ్యత పెరగడం, ఈ క్రమంలోనే అప్డేటెడ్ వెర్షన్ 5జీ భారత్‌లోకి ప్రవేశించడం విశేషం. అయితే.. సాధారణంగా ప్రతీ పదేళ్లకొకసారి కొత్తగా వైర్లెస్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీ వస్తుంటుంది. అలా.. 1జీ, 2జీ, 3జీ, 4జీ, 4.5జీ, 5జీ.. ఇలా వచ్చాయి. కొత్తగా ఒకటి రాగానే.. పాత జనరేషన్ టెక్నాలజీ కనుమరుగు కావడం విశేషం. కానీ, తొలి తరం వైర్లెస్ సెల్యూలార్ టెక్నాలజీ 1జీ, 2జీ..3జీలు వచ్చాక కూడా చాలా ఏళ్లపాటు మనుగడలో కొనసాగడం విశేషం. ఈ భూమ్మీద ఎక్కువ కాలం 1జీ సేవలు ఎక్కువ కాలం నడిచింది.. రష్యాలోనే!. ► 1980లో 1జీ వాడుకలోకి వచ్చింది. కేవలం ఆడియో ట్రాన్స్మిషన్స్ ఆధారిత సేవల కోసం ఇది పుట్టుకొచ్చింది. వేర్వేరు దేశాల్లో.. వేర్వేరు ప్రమాణాలు అభివృద్ధితో సేవలు అందాయి. అయితే ప్రపంచంలో చాలా చోట్ల నోర్డిక్ మొబైల్ టెలిఫోన్(NMT), అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్ సిస్టమ్(AMPS) వ్యవస్థలు పని చేశాయి. ► 90వ దశకం మధ్యలోనే 2జీ పుట్టుకొచ్చింది. 2000 సంవత్సరంలో పూర్తిస్థాయిలో 2జీ వాడుకతో.. 1జీ బంద్ అయ్యింది. కానీ.. ► చాలా ఏళ్లపాటు 1జీ సేవలు కొనసాగాయనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. ► ఫస్ట్ జనరేషన్ ఆఫ్ సెల్ల్యూలార్ నెట్వర్క్స్.. లో పవర్ రేడియో ట్రాన్స్మిట్టర్స్ సాయంతో ప్రత్యేకించి ఓ భౌగోళిక ప్రాంతంలో పని చేసేవి. ► ప్రపంచంలోనే ఫస్ట్ కమర్షియల్ సెల్యూలార్ నెట్వర్క్ 1979లో నిప్పోన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్(NTT) జపాన్‌లో ప్రారంభించింది. తొలుత మెట్రోపాలిటన్ ప్రాంతంగా టోక్యోలో ప్రారంభించారు. ► పానాసోనిక్ TZ-801 ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించిన తొలి ఫోన్. ఐదేళ్లలో ఆ నెట్వర్క్ జపాన్ అంతటా విస్తరించింది. అలా ప్రపంచంలో తొలి 1జీ/సెల్యూలార్ నెట్వర్క్ దేశంగా జపాన్ ఖ్యాతి సంపాదించుకుంది. అయితే.. ► జపాన్ కంటే ముందు బెల్ లాబోరేటరీస్(నోకియా బెల్ ల్యాబ్స్) ఫస్ట్ సెల్యూలార్నెట్వర్క్ను నిర్మించింది. ► జపాన్ తర్వాత.. స్వీడన్, నార్వే, సౌదీ అరేబియా, డెన్మార్క్, ఫిన్లాండ్, స్పెయిన్లు 1జీ నెట్వర్క్ ద్వారా కమర్షియల్ సెల్యూలార్ నెట్‌వర్క్‌లను మొదలుపెట్టాయి. ► 90వ దశకం మధ్యనాటికి 1జీ శకం ముగిసి.. 2జీ శకం మొదలైంది. జీఎఎస్ఎం, సీడీఎంఏ వన్ లాంటి సెల్యూలార్ టెక్నాలజీలు వాడుకలో వచ్చాయి. ► 2000 సంవత్సరం మొదటినాటికి 1జీ నెట్వర్క్ దాదాపుగా కనుమరుగు అయ్యింది. అయితే.. యూరప్ తూర్పు ప్రాంతాల్లో మాత్రం 1జీ నెట్‌వర్క్‌లు కొనసాగాయి. ఇక ప్రపంచంలో చివరగా 1జీ నెట్‌వర్క్‌ను మూసేసిన దేశం రష్యా. అలా.. 2017 దాకా 1జీ నెట్వర్క్ తన సేవలను కొనసాగించింది. ► 0G.. జీరో జనరేషన్ సెల్యూటార్ టెక్నాలజీ. ప్రీ సెల్యూలార్ వ్యవస్థలుగా వ్యహరిస్తుంటారు. మొబైల్ రేడియో టెలిఫోన్ వ్యవస్థలు.. వైర్లెస్ టైప్‌గా గుర్తింపు పొందాయి. 1940 నుంచి వీటి వాడకం పెరిగింది. వైర్లెస్ ఫోన్లు, వాకీటాకీలు వీటి కిందకు వచ్చేవి. ► 2జీ.. డిజిటల్‌గా ఎన్‌క్రిప్ట్ చేయబడిన సంభాషణలతో పాటు మొబైల్ డేటా, ఎస్సెమ్మెస్ సేవల కోసం అందుబాటులోకి వచ్చింది. 1991లో జీఎస్ఎం స్టాండర్డ్‌తో ఫిన్లాండ్లో 2జీ సెల్యూలార్ టెలికామ్ నెట్వర్క్స్ సేవలు మొదలు అయ్యాయి. ఆపై 2.5జీ ద్వారా జీపీఆర్ఎస్(General Packet Radio Service), 2.75జీ ద్వారా ఎడ్జ్(Enhanced Data rates for GSM Evolution) అందుబాటులోకి వచ్చాయి. ► 3జీ.. వైర్లెస్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీలో మూడవతరం. వేగంగా డాటా ట్రాన్స్ఫర్ కోసం, బెటర్ వాయిస్ క్వాలిటీ కోసం ఉద్దేశించబడింది. 2001 ఏడాది మధ్యలో 3జీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జపాన్‌కు చెందిన NTT డోకోమో అక్టోబర్ 1వ తేదీ, 2001లో 3జీ కమర్షియల్ సేవల్ని మొదలుపెట్టింది. భారత్‌లో 2008 డిసెంబర్ 11వ తేదీన మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్(MTNL) ద్వారా 3జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 3జీలో 3.5జీ, 3.75జీ కూడా వచ్చాయి. ► 4జీ.. బ్రాడ్‌బాండ్ సెల్యూలార్ నెట్వర్క్ టెక్నాలజీలో నాలుగవ తరం. వైమ్యాక్స్(Wimax) ప్రమాణాలతో 2006లో దక్షిణ కొరియాలో తొలి కమర్షియల్ 4జీ సేవలు లాంఛ్ అయ్యాయి. అయితే.. ► 2010 డిసెంబర్లో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ 4జీ నిర్వచనంలో లాంగ్ టర్మ్ ఎవల్యూషన్(LTE)ని కూడా జత చేసింది. ఎల్టీఈతో పాటు వైమ్యాక్స్, హెచ్ఎస్పీఏ+( Evolved High Speed Packet Access) ప్రమాణాలు కూడా 4జీకి జత కలిశాయి. ► 2021 నాటికి 4జీ టెక్నాలజీ ప్రపంచంలో దాదాపు 58 శాతం మార్కెట్‌ను ఆక్రమించింది. ► ఇక 5జీ విషయానికొస్తే.. 2019 నుంచే ప్రపంచవ్యాప్తంగా 5జీ సేవలు మొదలయ్యాయి. ► సౌత్ కొరియా 5జీ నెట్‌వర్క్‌ను లాంఛ్ చేసింది. ఎల్జీయూ ఫ్లస్ తప్పించి దాదాపు అన్ని కంపెనీ ఫోన్లు అక్కడ 5జీ నెట్వర్క్ ఆధారంగానే పని చేస్తున్నాయి. ► 2025 నాటికి.. ప్రపంచంలో 25 శాతం మొబైల్ టెక్నాలజీ మార్కెట్, 1.7 బిలియన్ సబ్‌స్క్రయిబర్స్ 5జీకే మొగ్గు చూపుతారని అంచనా ఉంది. ► 6జీ పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తిక కనబరుస్తున్నా.. అది ఇంకా ఆచరణలోకి రాలేదు. 2030 నాటికి అది ప్రపంచానికి అందుబాటులోకి రావొచ్చనేది ఒక అంచనా. ► 7G గురించి.. ఆసక్తికరమైన విషయం చర్చించుకోవాలి. ప్రపంచంలో కేవలం నార్వేలో 7జీ-8జీ స్పీడ్‌తో కొన్ని చోట్ల ఇంటర్నెట్ను అందిస్తున్నారు. అంటే.. సెకనుకు 11 గిగాబైట్స్ లెక్కను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. అయితే 6జీనే మనుగడ లేని టైంలో 7జీ సేవల గురించి ప్రపంచం అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. -
మూడు రూపాయలకే వన్ జీబీ డేటా.. ఎక్కడో తెలుసా?
Cheapest Mobile Data Countries:దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ యూసేజ్ బాగా పెరిగిపోయింది. అందరి చేతుల్లో స్మార్ట్ఫోన్లు ప్రత్యక్షమవుతున్నాయి. గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు. అయితే ఒక గిగాబైట్ (జీబీ) డేటా ఉపయోగించినందుకు ఇండియన్లు చేస్తున్న ఖర్చు ఎంత ? అతి తక్కువ ధరకే డేటాను అందిస్తున్న దేశాలు ఏవీ ? అనే అంశాలపై 221 రీజియన్లలో 6,148 మొబైల్ డేటా ప్లాన్లు పరిశీలించి తేల్చిన వివరాలు ఇలా ఉన్నాయి. డేటా విప్లవం మార్కెట్లోకి జియో నెట్వర్క్ రాకముందు దేశంలో నెట్ వినియోగం ఖరీదైన వ్యవహరంగానే ఉండేంది. దాదాపు సర్వీస్ ప్రొవైడర్లు అందరూ 1 జీబీ డేటాకు రూ. 200లకు పైగానే ఛార్జ్ చేశారు. అయితే 2016లో జియో వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతి తక్కువ ధరకే అపరిమితమైన డేటా అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలో ఒక్కసారిగా సోషల్ మీడియా విస్త్రృతమైంది. వీడియో కంటెంట్ వాడకం పెరిగి పోయింది. జియో ఎఫెక్ట్‌తో దాదాపు అన్ని నెట్‌వర్క్‌లు డేటా ప్లాన్స్‌ని తగ్గించాయి. మరోవైపు జియో క్రమంగా తన ప్లాన్ల రేట్లు పెంచుతూ పోయింది. ఇండియాలో రూ.50 ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిద నెట్‌వర్క్‌లు అందిస్తున్న ప్లాన్లను పరిగణలోకి తీసుకుంటే సగటున ఒక జీబీ డేటాను వినియోగించేందుకు రూ. 50 ఖర్చు పెడుతున్నారు భారతీయులు, ఇదే సమయంలో పొరుగున్న ఉన్న శ్రీలంక రూ. 28, బంగ్లాదేశ్ రూ.25వరకు ఖర్చు వస్తోంది. ఇండియాలో పోల్చితే శ్రీలంక, బంగ్లాదేశలలోనే డేటా ప్లాన్లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఇజ్రాయిల్ నెంబర్ వన్ మరో ఆసియా దేశమైన ఇజ్రాయిల్‌లో ఇంటర్నెట్ డేటా రేట్లు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి,. ఇజ్రాయిల్ ప్రజలు వన్ జీబీ డేటా కోసం రీఛార్జ్‌పై చేస్తున్న ఖర్చు కేవలం రూ.3 మాత్రమే.ప్రపంచంలో అతి తక్కువ ధరకే డేటా సర్వీసులు అందిస్తున్న దేశంతా ఇజ్రాయిల్ రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత కిర్కిజిస్తాన్ రూ. 13, ఫిజీ రూ. 18, ఇటలీ రూ, 20. సుడాన్ రూ, 20, రష్యా రూ. 21, మోల్డోవా దీవీ రూ. 23, చీలీలో రూ. 29 వంతున ఒక జీబీ డేటాపై ఛార్జ్ చేస్తున్నారు. తక్కువ ఛార్జీలు వసులూ చేస్తున్న ఇంటర్నెట్ డేటా అందిస్తోన్న టాప్ టెన్ దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్‌లతో పాటు టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే అమెరికాలకు స్థానం దక్కలేదు. అత్యంత పేద దేశమైన సుడాన్ అగ్ర రాజ్యాలకంటే తక్కువ ధరకే నెట్ అందిస్తోంది. సుడాన్లో టెలికాం కంపెనీలు 1 జీబీ డేటాకు సగటున రూ.20 వసూలు చేస్తున్నాయి. -
5జీ వచ్చేస్తోంది..
2020లో సెల్యులర్ నెట్వర్క్ టెక్నాలజీలో 5జీని చూడబోతున్నాం. ఈ ఏడాది భారత్‌లోకి 5జీ వచ్చేస్తోంది. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న 4జీ కంటే ఇది 10 రెట్లు వేగంతో డేటాను డౌన్లోడ్ చేస్తుంది. అంటే ఫోటోలు, వీడియోలు క్షణాల్లోనే మన స్మార్ట్ ఫోన్లలోకి వచ్చేస్తాయి. 5జీ ద్వారా వినియోగదారులు కనీసం 100–150 ఎంబీపీఎస్ నుంచి గరిష్టంగా 1 జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే మూడు గంటలు ఉన్న ఒక సినిమా సెకండ్లలోనే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ ఏడాదే 5జీ సేవలు భారత్‌కి అందుబాటులోకి వచ్చినా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ చేరువ కావడానికి మరో ఐదారేళ్లు పడుతుంది. -
నగరంలో 4జీ సేవలు
హైదరాబాద్, వైజాగ్ తర్వాత వరంగల్ బీటా సర్వీసులు ప్రారంభించిన ఎయిర్టెల్ సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో సేవలు హన్మకొండ : నగరవాసులకు శుభవార్త! నాలుగోతరం మొబైల్ ఇంటర్నెట్‌సేవలు వరంగల్ నగరంలో అందుబాటులోకి వచ్చాయి. హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఎయిర్టెల్ సంస్థ సోమవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. నెలరోజుల పాటు 4జీ సేవల పనితీరును బేరీజు వేసి సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో సేవలందిస్తామని కంపెనీ ప్రతి నిధులు స్పష్టం చేశారు. నగరంలో 4జీ సేవలు అందించేందుకు మొత్తం 100 టవర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 50 టవర్లు పూర్తిస్థాయిలో సేవలందిస్తారుు. 4జీ (బీటా) సేవలను ట్రయల్న్‌గ్రా ఎయిర్టెల్ సంస్థ ప్రారంభించింది. హైదరాబాద్, వైజాగ్ తర్వాత.. నాలుగోతరం సెల్యులార్ సేవలు మొదట హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఇటీవల ప్రారంభమయ్యాయి. తర్వాత 4జీ సేవలు అందుతున్న మూడో నగరం వరంగల్. దేశవ్యాప్తంగా 4జీ సేవలు 30 నగరాల్లో అందుతున్నారుు. సోమవారం హన్మకొండలోని ఎయిర్టెల్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ కరుణ, నగర పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబు, భారతీ ఎయిర్టెల్ జోనల్ మేనేజర్ నాగరాజు 4జీ సేవలను నగరంలో ప్రారంభించారు. ప్రారంభోత్సవ ఆఫర్‌గా 3జీ ధరలకే 4జీ సేవలందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో 4జీ హ్యాండ్సెట్లు వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలంగాణ, ఏపీ, ఎయిర్టెల్ సీఈవో విజయ్‌రాఘవన్ చెప్పారు. 4జీ హ్యాండ్సెట్లు ఉన్న వినియోగదారులు 4జీ సిమ్‌కార్డుల కోసం తమ షోరూంలలో సంప్రదించాలని కోరారు. పదింతల వేగం ప్రస్తుతం ఎయిర్టెల్ సంస్థ ఈ సేవలకు శ్రీకారం చుట్టగా త్వరలో ఇతర ఆపరేటర్లు సైతం సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 3జీతో పోల్చితే 4జీ సేవల ద్వారా ఇంటర్నెట్ వేగం ఎక్కువ. 3జీ సేవల్లో డాటా డౌన్లోడ్ వేగం సగటున 7 ఎంబీపీఎస్ (మెగాబైట్స్ పర్ సెకన్) ఉంది. ఇదే 4జీలో అయితే నిశ్చలంగా ఉన్నప్పుడు 1 జీబీపీఎస్ (గిగాబైట్స్ పర్ సెకన్ లేదా 1024 ఎంబీపీఎస్).. చలనంలో ఉంటే 100 ఎంబీపీఎస్‌గా ఉంటుం ది. సంబంధింత టవర్ నుంచి దూరం, డౌన్లోడ్ చేసే సమయంలో ట్రాఫిక్ రద్దీ, కంపెనీ అందిస్తున్న సేవల నాణ్యతను బట్టి డాటా డౌన్లోడ్ వేగంలో మార్పులు ఉంటాయి. సేవల్లో నాణ్యత 4జీ సేవలు అందుబాటులోకి వస్తే యూట్యూబ్‌లో వీడియోలు వీక్షించడం తేలికే. పెద్ద సైజు ఉన్న ఫొటోలు, వీడియోలనైనా క్షణాల్లో ఫేస్బుక్, వాట్సప్‌ల ద్వారా తమ స్నేహితులకు పంపించుకోవచ్చు. 1జీబీ డాటా ఉండే హెడీ సినిమానైనా నిమిషాల వ్యవధిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పౌర సేవలైన గ్యాస్‌బుకింగ్, కరెంటు బిల్లుల చెల్లింపుల్లో నాణ్యత పెరుగుతుంది. దేశవిదేశాలోని వర్సిటీల్లో చెప్పే ఆన్లైన్ క్లాసులకు ఇక్కడి నుంచి హాజరుకావచ్చు. ఎంజీఎం వంటి పెద్దాస్పత్రుల్లో అత్యవసర సమయాల్లో రోగులకు ఆన్లైన్ ద్వారా టెలీమెడిసిన్, ఇతర ప్రాంతాల్లో ఉన్న వైద్య నిపుణుల నుంచి సాయం తీసుకోవచ్చు.