2020లో సెల్యులర్ నెట్‌వర్క్ టెక్నాలజీలో 5జీని చూడబోతున్నాం. ఈ ఏడాది భారత్‌లోకి 5జీ వచ్చేస్తోంది. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న 4జీ కంటే ఇది 10 రెట్లు వేగంతో డేటాను డౌన్‌లోడ్ చేస్తుంది. అంటే ఫోటోలు, వీడియోలు క్షణాల్లోనే మన స్మార్ట్ ఫోన్లలోకి వచ్చేస్తాయి. 5జీ ద్వారా వినియోగదారులు కనీసం 100–150 ఎంబీపీఎస్ నుంచి గరిష్టంగా 1 జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే మూడు గంటలు ఉన్న ఒక సినిమా సెకండ్లలోనే డౌన్‌లోడ్ అయిపోతుంది. ఈ ఏడాదే 5జీ సేవలు భారత్‌కి అందుబాటులోకి వచ్చినా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ చేరువ కావడానికి మరో ఐదారేళ్లు పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment