ఇండియా టెక్నాలజీ రంగంలో పరుగులు పెడుతున్న తరుణంలో భారతీయులు సగటున ప్రతి రోజు 194 నిముషాలు.. అంటే మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గడుపుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, సగటున భారతీయులు 46 నిమిషాలు ఆన్‌లైన్ గేమ్‌లలోనూ, ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌లపై 44 నిమిషాలు ఇలా సమయం గడుపుతున్నట్లు తెలిసింది. ఈ డేటా 2.06 మిలియన్ల వినియోగదారుల నుంచి యాప్‌లోని డేటా ఆధారంగా విడుదల చేయడం జరిగింది.
మొత్తం 100 శాతం సోషల్ మీడియా వినియోగం స్మార్ట్‌ఫోన్‌లు లేదా టాబ్లెట్‌ల ద్వారా జరిగినట్లు స్పష్టమైంది. OTT కంటెంట్ కోసం 68 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌లు/టాబ్లెట్‌లను, 4 శాతం మంది ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్‌లను ఉపయోగించారు. ఇక 28 శాతం మంది టీవీ లేదా హోమ్ థియేటర్‌లను ఉపయోగించారు.
ఇదీ చదవండి: వారికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి - అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా!
ఇలా చేస్తే తగ్గే అవకాశం..
ఇంటర్నెట్‌లో సర్ఫింగ్ ఖర్చు విషయానికి వస్తే, సోషల్ మీడియా వినియోగదారులకు చాలా వరకు ఉచితం అని నివేదిక పేర్కొంది. కానీ వారు OTT కంటెంట్‌పై నెలకు రూ. 201 నుంచి రూ. 400, అదే విధంగా ఆన్‌లైన్ గేమింగ్‌పై నెలకు రూ. 100 కంటే తక్కువ చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్లాట్‌ఫామ్ ధరలను 30 శాతం పెంచినట్లయితే.. 71 శాతం మంది గేమర్‌లు, 17 శాతం OTT ప్రేక్షకులు సమయాన్ని తగ్గించే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment