హైదరాబాద్, వైజాగ్ తర్వాత వరంగల్
బీటా సర్వీసులు ప్రారంభించిన ఎయిర్‌టెల్
సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో సేవలు
హన్మకొండ : నగరవాసులకు శుభవార్త! నాలుగోతరం మొబైల్ ఇంటర్నెట్‌సేవలు వరంగల్ నగరంలో అందుబాటులోకి వచ్చాయి. హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఎయిర్‌టెల్ సంస్థ సోమవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. నెలరోజుల పాటు 4జీ సేవల పనితీరును బేరీజు వేసి సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో సేవలందిస్తామని కంపెనీ ప్రతి నిధులు స్పష్టం చేశారు. నగరంలో 4జీ సేవలు అందించేందుకు మొత్తం 100 టవర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 50 టవర్లు పూర్తిస్థాయిలో సేవలందిస్తారుు. 4జీ (బీటా) సేవలను ట్రయల్న్‌గ్రా ఎయిర్‌టెల్ సంస్థ ప్రారంభించింది.
హైదరాబాద్, వైజాగ్ తర్వాత..
నాలుగోతరం సెల్యులార్ సేవలు మొదట హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఇటీవల ప్రారంభమయ్యాయి. తర్వాత 4జీ సేవలు అందుతున్న మూడో నగరం వరంగల్. దేశవ్యాప్తంగా 4జీ సేవలు 30 నగరాల్లో అందుతున్నారుు. సోమవారం హన్మకొండలోని ఎయిర్‌టెల్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ కరుణ, నగర పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబు, భారతీ ఎయిర్‌టెల్ జోనల్ మేనేజర్ నాగరాజు 4జీ సేవలను నగరంలో ప్రారంభించారు. ప్రారంభోత్సవ ఆఫర్‌గా 3జీ ధరలకే 4జీ సేవలందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో 4జీ హ్యాండ్‌సెట్లు వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలంగాణ, ఏపీ, ఎయిర్‌టెల్ సీఈవో విజయ్‌రాఘవన్ చెప్పారు. 4జీ హ్యాండ్‌సెట్లు ఉన్న వినియోగదారులు 4జీ సిమ్‌కార్డుల కోసం తమ షోరూంలలో సంప్రదించాలని కోరారు.
పదింతల వేగం
ప్రస్తుతం ఎయిర్‌టెల్ సంస్థ ఈ సేవలకు శ్రీకారం చుట్టగా త్వరలో ఇతర ఆపరేటర్లు సైతం సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 3జీతో పోల్చితే 4జీ సేవల ద్వారా ఇంటర్నెట్ వేగం ఎక్కువ. 3జీ సేవల్లో డాటా డౌన్‌లోడ్ వేగం సగటున 7 ఎంబీపీఎస్ (మెగాబైట్స్ పర్ సెకన్) ఉంది. ఇదే 4జీలో అయితే నిశ్చలంగా ఉన్నప్పుడు 1 జీబీపీఎస్ (గిగాబైట్స్ పర్ సెకన్ లేదా 1024 ఎంబీపీఎస్).. చలనంలో ఉంటే 100 ఎంబీపీఎస్‌గా ఉంటుం ది. సంబంధింత టవర్ నుంచి దూరం, డౌన్‌లోడ్ చేసే సమయంలో ట్రాఫిక్ రద్దీ, కంపెనీ అందిస్తున్న సేవల నాణ్యతను బట్టి డాటా డౌన్‌లోడ్ వేగంలో మార్పులు ఉంటాయి.
సేవల్లో నాణ్యత
4జీ సేవలు అందుబాటులోకి వస్తే యూట్యూబ్‌లో వీడియోలు వీక్షించడం తేలికే. పెద్ద సైజు ఉన్న ఫొటోలు, వీడియోలనైనా క్షణాల్లో ఫేస్‌బుక్, వాట్సప్‌ల ద్వారా తమ స్నేహితులకు పంపించుకోవచ్చు. 1జీబీ డాటా ఉండే హెడీ సినిమానైనా నిమిషాల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పౌర సేవలైన గ్యాస్‌బుకింగ్, కరెంటు బిల్లుల చెల్లింపుల్లో నాణ్యత పెరుగుతుంది. దేశవిదేశాలోని వర్సిటీల్లో చెప్పే ఆన్‌లైన్ క్లాసులకు ఇక్కడి నుంచి హాజరుకావచ్చు. ఎంజీఎం వంటి పెద్దాస్పత్రుల్లో అత్యవసర సమయాల్లో రోగులకు ఆన్‌లైన్ ద్వారా టెలీమెడిసిన్, ఇతర ప్రాంతాల్లో ఉన్న వైద్య నిపుణుల నుంచి సాయం తీసుకోవచ్చు.
నగరంలో 4జీ సేవలు
Published Tue, Aug 4 2015 2:58 AM | Last Updated on Wed, Aug 29 2018 7:26 PM
Advertisement