ఎయిర్‌టెల్ మొబైల్ డేటా బ్యాక్ ఆఫర్ | Airtel mobile data Back Offer | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్ మొబైల్ డేటా బ్యాక్ ఆఫర్

Published Fri, Oct 30 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

ఎయిర్‌టెల్ మొబైల్ డేటా బ్యాక్ ఆఫర్

ఎయిర్‌టెల్ మొబైల్ డేటా బ్యాక్ ఆఫర్

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీనికింద.. కస్టమర్లు రాత్రి వేళ ఉపయోగించే మొబైల్ డేటాలో సగభాగాన్ని మర్నాడు వారి ఖాతాకే తిరిగి క్రెడిట్ చేయనుంది. అలాగే, తమ మొబైల్ యాప్ వింక్‌పై నెలకు అయిదు సినిమాలు, అపరిమితంగా పాటలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెస్తోంది.

దీనికి డేటా చార్జీలు వర్తిస్తాయి. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రకటించిన డేటా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వారం రోజుల్లో పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు కూడా వర్తింపచేయనున్నట్లు డెరైక్టర్ (కన్జూమర్ బిజినెస్ విభాగం) శ్రీని గోపాలన్ తెలిపారు. రాత్రి 12 గం.ల నుంచి ఉదయం 6 గం.ల మధ్య వినియోగించే డేటాలో 50% పరిమాణాన్ని ప్రతిరోజూ కస్టమర్ల ఖాతాలో తిరిగి జమ చేయనున్నట్లు వివరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement