Reliance Jio Subsea Cable System Lands In Maldives: జియో మ‌రో సంచ‌న‌లం!! - Sakshi
Sakshi News home page

జియో మ‌రో సంచ‌న‌లం!! ప్లాన్ మామూలుగా లేదుగా!

Published Mon, Feb 21 2022 2:14 PM | Last Updated on Tue, Feb 22 2022 2:11 PM

Jio Subsea Cable System Lands In Maldives - Sakshi

టెలికం రంగంలో సంచలనాలకు వేదికైన రిలయన్స్‌ జియో మ‌రో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోని ఇత‌ర ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ చేస్తూ జియో సముద్ర మార్గానా ఇంట‌ర్నెట్ కేబుల్ నిర్మాణాల్ని చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ నిర్మాణాలు త్వ‌ర‌లో మాల్దీవ్లోని హుల్ హుమ‌లే ప్రాంతం వ‌ర‌కు క‌నెక్ట్ కానున్నాయి.  

సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ సామర్థ్యంతో జియో సంస్థ ముంబై, చెన్నై కేంద్రంగా పదహారు వేల కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌ను వేస్తుంది. ప్ర‌స్తుతం ఈ కేబుల్స్ నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. తాజాగా ఈ కేబుల్స్ నిర్మాణం మాల్దీవులోని హుల్‌హుమలే ప్రాంతం వ‌ర‌కు  క‌నెక్ట్ అవుతున్న‌ట్లు జియో తెలిపింది. త‌ద్వారా భారత్‌, సింగపూర్‌ల‌లో ప్రపంచంలోని ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ కానున్నాయి.  
  
ఈ సంద‌ర్భంగా మంత్రి ఉజ్ ఫయాజ్ ఇస్మాయిల్ మాట్లాడుతూ..మాల్దీవుల మొదటి అంతర్జాతీయ కేబుల్ నిర్మాణం గురించి మాట్లాడుతూ..మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, నాణ్య‌మైన ఇంట‌ర్నెట్‌ను అందించ‌డం ద్వారా మాల్దీవుల ప్ర‌జ‌లు ఆర్ధికంగా అన్నీ రంగాల్లోని అవ‌కాశాల్ని అందిపుచ్చుకుంటార‌ని కొనియాడారు. ఆర్థికాభివృద్ధితో పాటు, ఇది మాల్దీవుల అంతటా హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారా సామాజిక అభివృద్ధి వేగవంతం అవుతుంద‌ని ఉజ్ ఫ‌యాజ్ అన్నారు.

చ‌ద‌వండి: రిలయన్స్ జియోకు దిమ్మతిరిగేలా షాక్..! దెబ్బ మామూలుగా లేదు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement