
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో కొత్త సాచెట్ ప్లాన‍్లను ప్రకటించింది. వినియోగదారుల బేస్‌ను భారీగా పెంచుకుంటున్న జియో మరింతగా కస‍్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా అతి తక్కువ విలువ చేసే రూ.100 లోపు మూడు 4జీ కొత్త ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. తద్వారా 4జీ డేటాను చాలా సులభ ధరలో తమ కస‍్టమర్లకు అందిస్తున్నట్టు తెలిపింది. జియో ప్రైమ్ కస్టమర్ల కోసం వీటిని అందుబాటులోకి తెచ్చింది. టెలికాం దిగ్గజం జియో సాచెట్ ప్యాక్ కింద ఈ మూడుకొత్తప్లాన్‌లను ప్రకటించింది. జియో కస‍్టమర్లకు అతి వేగవంతమైన 4జీ సేవలను అందించేలా వీటిని అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు మోస్ట్ పాపులర్ పాక్‌లపై భారీ డిస్కౌంట్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. రూ.19, రూ. 52,రూ.98 విలువ చేసే మూడు కొత్తప్లాన్లను పరిచయం చేసింది.
19 రూపాయలకు ఒకరోజు వాలిడిటీ, 150 ఎంబీ 4జీ హై స్పీడ్ డేటా, 20 లోకల్ ఎస్‌ఎంఎస్‌లు ఉచితం
52 రూపాయలకు 10.5 జీబీ 4జీ డేటా, వారం రోజుల వాలిడిటీ, 70 లోకల్ ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.
98 రూపాయలకు 2.1 జీబీ 4జీబీ డేటా, 14 రోజుల వాలిడిటీ. డెయిలీ లిమిట్ 0.15 జీబీ, 140 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.
వీటితో పాటు ఇప్పటికే ఉన్నప్లాన్లపై కూడా డిస్కౌంట్‌ను అందిస్తోంది. రూ.199 ప్యాక్‌పై రూ50 లు తగ్గించి రూ149లకే అందిస్తోంది. 1 జీబీ 4జీబీ డేటా, 28 రోజులువాలిడిటీ. అలాగే రూ.399 ప్యాక్ రూ.50 డిస్కౌంట్‌తో రూ.349 లకే లభ్యం. రోజుకి 1 జీబీ చొప్పున మొత్తం 70 జీబీ అందిస్తుంది. రూ. 499 రూ.399 రూ. 449 ప్లాన్లకు కూడా ఈ తగ్గింపును వర్తింప చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment