కేంద్రానికి కెయిర్న్ ఎనర్జీ భారీ ఝలక్
న్యూఢిల్లీ : పన్ను వివాదాలతో, తమ వ్యాపారాలను కుదేలు చేసినందుకు తమకు భారత ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బ్రిటీష్ ఎక్స్ ప్లోరర్ కెయిర్న్ ఎనర్జీ డిమాండ్ చేస్తోంది. 5.6 బిలియన్ డాలర్ల(రూ.37,400కోట్లను) నష్టపరిహారాన్ని కేంద్రప్రభుత్వం నుంచి కెయిర్న్ కోరుతోంది.10 ఏళ్ల ఇంటర్నెల్ ఇండియా యూనిట్ ను పునర్ వ్యవస్థీకరించేందుకు కెయిర్న్ ప్రభుత్వం నుంచి ఈ నష్టపరిహారాన్ని ఆశిస్తోంది. జూన్ 28న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్యానెల్ కు 160 పేజీల "స్టేట్ మెంట్ ఆఫ్ క్లెయిమ్" ను ఫైల్ చేసింది.
ఎడిన్ బర్గ్ కు చెందిన ఈ కంపెనీ, భారత్ లో పన్ను డిమాండ్ ను ఉపసంహకరించుకోవాలని కోరింది. 2014 జనవరిలో ఆదాయపు పన్ను విభాగం జారీచేసిన పన్ను డిమాండ్, షేర్ల అటాచింగ్ తో కెయిర్న్ ఇండియా సబ్సిడరీ భారీగా నష్టాల పాలైంది. టాక్స్ డిపార్ట్ మెంట్ విచారణ నేపథ్యంలో 700 మిలియన్ డాలర్లు(రూ.4690 కోట్లు) విలువచేసే ఇండియన్ వెంచర్ విక్రయం స్తంభించింది. ఆ ఆలస్యంతో ఉత్పన్నమైన నష్టాలను భారత్ చెల్లించాల్సిందిగా కెయిర్న్ కోరుతోంది.
9.8శాతం షేర్ హోల్డింగ్ కోల్పోవడంతో, విలువ నష్టం కింద 1.05 బిలియన్ డాలర్ల నష్టపరిహారం డిమాండ్ చేసింది. మొత్తంగా పెట్టుబడుల ఒప్పంద ఉల్లంఘన, పెనాల్టీలు, వడ్డీలు అన్నీ కలుపుకొని, పన్ను డిమాండ్ కు సమానంగా నష్టపరిహారం చెల్లించాలని కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కెయిర్న్ కోర్టులో ఫైల్ చేసింది. ఈ పిల్ విచారణ నేపథ్యంలో యూకే-ఇండియా పెట్టుబడుల ఒప్పందాన్ని కెయిర్న్ చాలెంజ్ చేయనుంది.
జెనీవాకు చెందిన న్యాయమూర్తి లారెంట్ లెవీ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ ప్యానెల్ కెయిర్న్ ఎనర్జీ పిల్ ను విచారణ ప్రారంభించనుంది. మేలో పన్ను డిమాండ్ లకు వ్యతిరేకంగా, కంపెనీ గత నెలలో స్టేట్ మెంట్ ఆఫ్ క్లెయిమ్ దాఖలు చేసింది. కేంద్రప్రభుత్వం దీనిపై స్టేట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ కింద నవంబర్ లో తన ఫైల్ దాఖలు చేయనుంది. 2017 మొదట్లో ఈ పిల్ పై ప్రామాణికమైన విచారణ జరుగనుంది. కెయిర్న్ తన భారత ఆస్తులను కొత్త సబ్సిడరీకి మరలించినందుకు మూలధన లాభాల పన్ను రూ.10,247 కోట్ల ఆరోపణలను ఎదుర్కొంది. 2011లో మెజార్టీ స్టాక్ వేదాంత రిసోర్స్ కు అమ్మేసినా.. 9.8 శాతం స్టాక్ కంపెనీనే కలిగి ఉందనే ఆరోపణలతో, వాటిని ఆదాయపు పన్ను విభాగం అటాచ్ చేసుకుంది.