Rs 30
-
జీఎస్టీ ఎఫెక్ట్: కార్లపై భారీ డిస్కౌంట్స్
న్యూఢిల్లీ: జులై 1 నుంచి గూడ్స్ సర్వీసు టాక్స్ (జీఎస్టీ) అమల్లోకి రానున్న నేపథ్యంలో వివిధ వాహన తయారీదారులు, కంపెనీల డీలర్లు కార్ల ధరలను భారీగా తగ్గించేశారు. వివిధ మోడళ్లపై గత డిస్కౌంట్లను మరింత పెంచి మొత్తంగా దాదాపు రూ.10 వేల నుంచి రూ.30వేలకు తగ్గింపు ధరల్లో కార్లను అందుబాటులోకి తెచ్చాయి. జూన్ నెలలో అమ్మకాలపై కన్నేసిన డీలర్లు ఈ ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నాయి. గతంలో ప్రకటించిన నగదును తగ్గింపును మరింత పెంచాయి. ముఖ్యంగా మారుతి వాగాన్ ఆర్ పై డిస్కౌంట్‌ను రూ.30వేలకు (గతంలో రూ.20వేలు) పెంచగా, స్విఫ్ట్ పై రూ. 10వేలనుంచి రూ.20వేలకు పెంచింది. సెలెరోపై రూ. 20వేల వరకు స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఆల్టో పై ప్రస్తుతం ఉన్న నగదు తగ్గింపును రూ. 30వేలనుంచి మరో అయిదువేలకు పెంచింది. ఈ డిస్కౌంట్‌తోపాటు ఉచిత భీమా, లాభదాయక బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన అనంతరం ఎలక్ట్రిక్ వాహనాలు, పెద్దఎస్యూవీలపై అధిక పన్ను రేటు నేపథ్యంలో డీలర్లు ఉన్నస్టాక్‌ను క్లియర్ చేసుకునే పనిలోఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీ, కోలకతా వంటి నగరాల్లో మారుతి డీలర్లు ఆల్టో, వాగాన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్ వంటి వాహనాలపై జూన్ 31 లోపు కొనుగోలు చేసిన కస్టమర్లకు నగదు రాయితీలను అందజేస్తున్నట్టు పేర్కొంది. ఇదే బాటలో పయనించిన హుందాయ్ డీలర్లు కూడా తమ కార్లపై డిస్కౌంట్లను రెట్టింపు చేశాయి. ఇయాన్, గ్రాండ్ ఐ10 పై తగ్గింపు రేటును ప్రకటించింది. మహీంద్ర అండ్ మహీంద్ర ఎక్స్‌యూవీ 500పై లక్షలవరకు డిస్కౌంట్ అందిస్తోంది. జపనీస్ కార్ మేకర్ టొయోటాకు చెందిన ఇన్నోవా, ఫార్చూనర్ ధరలు కూడా దిగిరానున్నాయి. అయితే భారీ డిమాండ్ కారణంగా టొయాటో డీలర్లు మాత్రం ఇంకా ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించలేదు. మరోవైపు సబ్-4 మీటర్ కార్లపై జీఎస్టీ ప్రభావం ఉందడని మారుతి డీలర్లు చెబుతున్నారు జీఎస్టీ అమలు కోసం వినియోగదారులు వేచి చూస్తున్నారనీ, ఇది జూన్ నెల వాహన విక్రయాలపై ప్రభావం చూపే అవకాశంఉందన్నారు. అందుకే స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు చెప్పారు. తమ కంపెనీ నెలవారీ డిస్కౌంట్లకు ఇంకా ప్రకటించపోయినప్పటికీ డీలర్లు నెలవారీ రిటైల్ అమ్మకాలను కొనసాగించడానికి అదనపు డిస్కౌంట్లను అందిస్తున్నామని హ్యుందాయ్ డీలర్ చెప్పారు. ప్రస్తుతం స్కార్పియో హైబ్రిడ్‌పై రూ. 30,000 డిస్కౌంట్ ఉందనీ, తదుపరి రెండు నెలల్లో దీని ధర పెరుగుతుందని భావిస్తున్నామని ముంబై ఎం అండ్ ఎం డీలర్ తెలిపారు. కాబట్టి ఈ వెహికల్ అమ్మకాలను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే జూలై నుంచి ధరల ప్రభావం జిఎస్టిపై ఉంటుందనేది తాము ఇంకా అంచనావేయలేకపోతున్నామని చెప్పారు. కాగా జీఎస్టీ కొత్త పన్ను రేటు ప్రకారం, కార్లు మరియు ఎస్‌యూవీల 4 మీటర్లు, పరిమాణంలో 1.5 లీటర్ కంటే ఎక్కువ డీజిల్ ఇంజిన్ ఉన్న వాటికి ప్రస్తుత పన్ను రేటు 51.5, 55 శాతంతో పోలిస్తే జీఎస్టీలో పన్నురేటు 28శాతం + సెస్ కలుపుకుంటే మొత్తం 48 శాతం పన్ను అమలుకానుంది. -
కెయిర్న్ ఎనర్జీకి భారీ జరిమానా
న్యూఢిల్లీ: బ్రిటీష్ సంస్థ , ఇంధన రంగ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను శాఖ కెయిర్న్ ఎనర్జీకి ఆదాయపన్ను శాఖ మరోసారి భారీ షాక్ ఇచ్చింది. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చెల్లించని కారణంగా రూ. 30,700 కోట్ల భారీ జరిమానా విధించింది. రూ10,247 కోట్ల రూపాయల క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఐటీ ఈ నోటీసులు జారీ చేసింది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద కెయిర్న్ ఎనర్జీ రూ. 10,247 కోట్లు కట్టాల్సిందేనని ట్యాక్స్ ట్రిబ్యునల్ ఐటీఏటీ స్పష్టం చేసిన కొన్ని వారాల్లో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నోటీసులతోపాటు, ఎందుకు జరిమానా విధించ కూడదో చెప్పాలంటూ మరో షో కాజ్ నోటీసును కూడా జారీ చేసింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా కోరినట్టు సీనియర్ ఐటీ అధికారి ఒకరు తెలిపారు. ఆదాయపన్ను చట్టం 271 (1)(సీ) ప్రకారం ఈ పెనాల్టీ విధిస్తున్నట్టు చెప్పారు. అంచనా ప్రకారం 2016 జనవరిలో ఇది పూర్తికావాల్సి ఉందని, ఈనేపథ్యంలో రూ.10,247 కోట్ల పన్ను చెల్లించాల్సిందిగా ఫైనల్ నోటీస్ జారీచేశామన్నారు. మొత్తం ఈ పన్నుకు తోడుగా ఈ 10 సంవత్సరాల వడ్డీనిమిత్తం మరో రూ. 18,800 కోట్లను జోడించినట్టు చెప్పారు. అయితే దీనిపై స్పందించడానికి కెయిర్న్ ఎనర్జీ ప్రతినిధి ప్రస్తుతానికి అందుబాటులో లేరు. కాగా గత నెలలో ఐటీఏటి రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చెల్లించాల్సిందే నని కెయిర్స్కు కస్పష్టం చేసింది. అయితే, గతకాల లావాదేవీలకు కూడా వర్తించేలా సవరించిన చట్టం కింద డిమాండ్ నోటీసు ఇచ్చినందున.. వడ్డీ విధించడానికి లేదని పేర్కొంది. కెయిర్న్ ఇండియాను లిస్ట్ చేయడానికి ముందు అంతర్గత వ్యాపార పునర్వ్యవస్థీకరణ కింద 2006లో షేర్ల బదలాయింపు అంశానికి సంబంధించి ఐటీఏటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయ్!
న్యూఢిల్లీ: వరుసగా వాహన కంపెనీలు వాహనాల ధరలను పెంచేస్తున్నాయి. కార్ల దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. పెరిగిన ఇన్పుట్ ఖర్చులు, కరెన్సీ హెచ్చుతగ్గులు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో వచ్చే నెల 2017 జనవరి నుంచి తన వాహనాల ధరలను రూ.30,000 వరకు పెంచుతున్నట్లు తెలిపింది.. జనవరి 1, 2017 నుంచి 1-2 శాతం ధరలు పెరగనున్నాయని, ఇది ఉత్పత్తి మరియు వేరియంట్లపై ఆధారపడి ఉంటుందని జిఎం ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ హర్ దీప్ బ్రార్ ఒక ప్రకటనలో చెప్పారు. ముడి పదార్థం ధరల పెరుగుదలతో ఉత్పాదక వ్యయం గణనీయంగా పెరిగిందనీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ రేటు , అత్యధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణాల రీత్యా ధరలు పెంపు తప్పనిసరి అయిందన్నారు. కాగా దాదాపు అన్ని కంపెనీలు వచ్చే జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్టు ఇటీవల ప్రకటించాయి. హ్యుందాయ్ మోటార్స్, టాటా మోటార్స్, టయోటా, నిస్సాన్, బెంజ్ సహా అనేక కంపెనీల కార్ల ధరలు పెరగనున్న సంగతి తెలిసిందే. -
ఐఫోన్ ఎస్ఈ కొనే వాళ్లు ఆగండి..
యాపిల్ తాజాగా ఆవిష్కరించిన ఐఫోన్ ఎస్ఈ కొనాలనుకుంటున్నారా? అయితే కొన్ని నెలలు ఆగాల్సిందే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఎందుకంటే ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గుతుందంట. ప్ర్తస్తుతం భారత మార్కెట్లో రూ.39 వేలుగా ఉన్న దీని ధర రూ. 30 వేలకు పడిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేట్టు ఈ ఫోన్ ధర తగ్గించనున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 5ఎస్ భారత్ మార్కెట్లో మంచి డిమాండ్ పలకడం, ఐఫోన్ ఎస్ఈకి ధర తగ్గుదలకు ఆటంకంగా మారింది. 2015 చివరి క్వార్టర్ లో ఈ ఐఫోన్ 5ఎస్ లను కంపెనీ ఎక్కువగా దిగుమతి చేసుకుంది. ఈ స్టాక్ అమ్ముడుపోయే వరకు ఐఫోన్ ఎస్ఈ ధర రూ.39 వేలగానే ఉంచేందుకు కంపెనీ నిర్ణయించింది. ఒకవేళ ఇప్పుడే ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గిస్తే 5ఎస్ అమ్మకాలు పడిపోయే అవకాశాలు ఉండటంతో, ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గింపుకు మరికొన్ని నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాని కొన్ని నెలల్లోనే యాపిల్ కచ్చితంగా ఐఫోన్ ఎస్ఈ ధరను తగ్గిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా క్యాష్ బ్యాక్, ఈఎంఐ ఆఫర్లను కూడా ఐఫోన్ ఎస్ఈకి యాపిల్ కల్పించనుంది. ఐఫోన్ ఎస్ఈకు ముందు మార్కెట్లోకి వచ్చిన 16జీబీ ఐఫోన్ 6ఎస్ ధర కూడా కొన్ని నెలల్లోనే రూ.62 వేల నుంచి రూ.42 లకు పడిపోయింది. ఇదే విధంగా కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన ఐఫోన్ ఎస్ఈ ధరను కూడా యాపిల్ తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 6ఎస్ కు, ఎస్ఈకి పెద్ద తేడాలు ఏమీ లేవని, ఒకే విధమైన ఫీచర్స్ ను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయంటున్నారు. -
రూ.30,000 కోట్లకు జన్ ధన్ డిపాజిట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు ప్రతిష్టాత్మక ‘ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజనా (పీఎంజేడీయూ)’ కార్యక్రమం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డిపాజిట్లు రూ.30,000 కోట్లకు పైగా చేరాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జనవరి 20 వరకు జన్ ధన్ యోజనా కింద దాదాపు 20.38 కోట్ల బ్యాంకు ఖాతాల ప్రారంభం జరిగింది. -
భార్య తాకట్టు...హత్య
చండీగఢ్: ఆపదలో వున్నపుడు, ఆర్థిక అవసరాలకోసం విలువైన వస్తువులను, ఆస్తులను తాకట్టు పెట్టడం మామూలు విషయమే. కానీ ముప్పయి వేలకోసం భార్యను తాకట్టుపెట్టాడు హర్యానాలోని ఓ వ్యక్తి. అయితే తీసుకున్న అప్పు చెల్లించినా భార్యను విడుదల చేయడానికి నిరాకరించిన సదరు వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు ఉన్నతాధికారుల కథనం ప్రకారం సల్మాను సబ్బీర్ ఇద్దరూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. కొంతకాలం క్రితం హరియాణా వచ్చిన స్థానికంగా ఒకఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ పొట్ట పొసుకుంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. బొంతలు కుట్టి అమ్ముకునే గోలం, సబ్బీర్ దంపతులు పక్క పక్కనే ఉండేవారు. ఈ క్రమంలో గోలం దగ్గర భార్య సల్మాను తాకట్టుపెట్టాడు సబ్బీర్ . కొంతకాలానికి ఎలాగోలా కష్టపడి ఆ అప్పును తీర్చేశాడు. కానీ సల్మాను విడిచిపెట్టడానికి గోలం నిరాకరించడంతో పాటుగా మరింత డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. దీనిపై నిలదీయడానికి అతని స్నేహితులు అక్తర్, గౌరవ్ తో కలిసి గోలం నివాసానికి వెళ్లాడు. అక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలోనే గోలంను హత్యచేసి సమీపంలోని పొదల్లో పడేసి వెళ్లిపోయారని డిఎస్పీ రాజేంద్ర కుమార్ తెలిపారు అక్టోబర్ 31న హత్య జరిగితే నవంబర్ 1 న తేదీన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానిక యమునానగర్ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ మృతదేహం ఆచూకీ కోసం ఆరాతీయగా బొంతలు తయారు చేసుకొనే గోలందిగా స్థానికులు గుర్తించారు. హత్యకేసుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఎట్టకేలకు గత ఆదివారం ఛేదించారు. అనుమానాస్పద వ్యక్తులుగా సబ్బీర్, సల్మా దంపతులను అదుపులోకి ప్రశ్నించగా, నేరాన్ని అంగీకరించారు. అయితే గోలం ను హత్యచేసిన విషయాన్ని అతని బంధువులకు సమాచారం అందించినట్టు సల్మా పోలీసులతో చెప్పింది. ఈ విషయాన్ని గోలం బంధువు ఆలం కూడా ధృవీకరించారు. వారి మధ్య జరిగిన లావేదేవీల గురించి తనకు తెలియదు గానీ, గోలందగ్గర పాటుగా సల్మా నాలుగు ఉన్నట్టు అంగీకరించారు.