జీఎస్‌టీ ఎఫెక్ట్: కార్లపై భారీ డిస్కౌంట్స్
న్యూఢిల్లీ: జులై 1 నుంచి గూడ్స్ సర్వీసు టాక్స్ (జీఎస్‌టీ) అమల్లోకి రానున్న నేపథ్యంలో వివిధ వాహన తయారీదారులు, కంపెనీల డీలర్లు కార్ల ధరలను భారీగా తగ్గించేశారు. వివిధ మోడళ్లపై గత డిస్కౌంట్లను మరింత పెంచి మొత్తంగా దాదాపు రూ.10 వేల నుంచి రూ.30వేలకు తగ్గింపు ధరల్లో కార్లను అందుబాటులోకి తెచ్చాయి. జూన్ నెలలో అమ్మకాలపై కన్నేసిన డీలర్లు ఈ ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నాయి.
గతంలో ప్రకటించిన నగదును తగ్గింపును మరింత పెంచాయి. ముఖ్యంగా మారుతి వాగాన్ ఆర్ పై డిస్కౌంట్‌ను రూ.30వేలకు (గతంలో రూ.20వేలు) పెంచగా, స్విఫ్ట్ పై రూ. 10వేలనుంచి రూ.20వేలకు పెంచింది. సెలెరోపై రూ. 20వేల వరకు స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఆల్టో పై ప్రస్తుతం ఉన్న నగదు తగ్గింపును రూ. 30వేలనుంచి మరో అయిదువేలకు పెంచింది. ఈ డిస్కౌంట్తోపాటు ఉచిత భీమా, లాభదాయక బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి.
జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన అనంతరం ఎలక్ట్రిక్ వాహనాలు, పెద్దఎస్‌యూవీలపై అధిక పన్ను రేటు నేపథ్యంలో డీలర్లు ఉన్నస్టాక్‌ను క్లియర్ చేసుకునే పనిలోఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీ, కోలకతా వంటి నగరాల్లో మారుతి డీలర్లు ఆల్టో, వాగాన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్ వంటి వాహనాలపై జూన్ 31 లోపు కొనుగోలు చేసిన కస్టమర్లకు నగదు రాయితీలను అందజేస్తున్నట్టు పేర్కొంది. ఇదే బాటలో పయనించిన హుందాయ్ డీలర్లు కూడా తమ కార్లపై డిస్కౌంట్లను రెట్టింపు చేశాయి. ఇయాన్, గ్రాండ్ ఐ10 పై తగ్గింపు రేటును ప్రకటించింది. మహీంద్ర అండ్ మహీంద్ర ఎక్స్‌యూవీ 500పై లక్షలవరకు డిస్కౌంట్ అందిస్తోంది. జపనీస్ కార్ మేకర్ టొయోటాకు చెందిన ఇన్నోవా, ఫార్చూనర్ ధరలు కూడా దిగిరానున్నాయి. అయితే భారీ డిమాండ్ కారణంగా టొయాటో డీలర్లు మాత్రం ఇంకా ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించలేదు.
మరోవైపు సబ్-4 మీటర్ కార్లపై జీఎస్‌టీ ప్రభావం ఉందడని మారుతి డీలర్లు చెబుతున్నారు జీఎస్‌టీ అమలు కోసం వినియోగదారులు వేచి చూస్తున్నారనీ, ఇది జూన్ నెల వాహన విక్రయాలపై ప్రభావం చూపే అవకాశంఉందన్నారు. అందుకే స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు చెప్పారు.
తమ కంపెనీ నెలవారీ డిస్కౌంట్లకు ఇంకా ప్రకటించపోయినప్పటికీ డీలర్లు నెలవారీ రిటైల్ అమ్మకాలను కొనసాగించడానికి అదనపు డిస్కౌంట్లను అందిస్తున్నామని హ్యుందాయ్ డీలర్ చెప్పారు.
ప్రస్తుతం స్కార్పియో హైబ్రిడ్‌పై రూ. 30,000 డిస్కౌంట్ ఉందనీ, తదుపరి రెండు నెలల్లో దీని ధర పెరుగుతుందని భావిస్తున్నామని ముంబై ఎం అండ్ ఎం డీలర్ తెలిపారు. కాబట్టి ఈ వెహికల్ అమ్మకాలను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే జూలై నుంచి ధరల ప్రభావం జిఎస్టిపై ఉంటుందనేది తాము ఇంకా అంచనావేయలేకపోతున్నామని చెప్పారు.
కాగా జీఎస్‌టీ కొత్త పన్ను రేటు ప్రకారం, కార్లు మరియు ఎస్‌యూవీల 4 మీటర్లు, పరిమాణంలో 1.5 లీటర్ కంటే ఎక్కువ డీజిల్ ఇంజిన్ ఉన్న వాటికి ప్రస్తుత పన్ను రేటు 51.5, 55 శాతంతో పోలిస్తే జీఎస్టీలో పన్నురేటు 28శాతం + సెస్ కలుపుకుంటే మొత్తం 48 శాతం పన్ను అమలుకానుంది.