సాక్షి, న్యూఢిల్లీ : వృద్ధి రేటు పతనమవడంతో ఆర్థిక వ్యవస్థను ఉత్తేజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. కార్పొరేట్ ట్యాక్స్‌ను గణనీయంగా తగ్గించడంతో పాటు షేర్ల విక్రయం, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో యూనిట్ల అమ్మకం ద్వారా సమకూరే క్యాపిటల్ గెయిన్స్‌పై అదనంగా విధించిన సర్‌చార్జ్ నుంచి వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలను మినహాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. క్యాపిటల్ మార్కెట్‌లోకి నిధుల ప్రవాహాన్ని స్ధిరీకరించేందుకు ఇటీవల ఫైనాన్స్ చట్టం ద్వారా షేర్ల విక్రయంపై పొందే క్యాపిటల్ గెయిన్స్‌పై అదనంగా విధించిన సర్‌చార్జ్ వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబానికి (హెచ్‌యూఎఫ్) వర్తించవని మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడంతో పాటు పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment