
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. కాగా, సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత భట్లి విక్రమార్క.. కేసీఆర్ సర్కార్‌పై కౌంటర్ అటాక్‌కు దిగారు. అటు కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంకెలు పెద్దగా ఉన్నాయి.. కేటాయింపులు చిన్నగా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏమీ ప్రకటించలేదు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. అదానీ కంపెనీ ఏం చేసిందో బయటపడింది. హిండెన్‌బర్గ్ అన్నీ బయటపెట్టింది. దేశ సంపద దోపిడీకి గురవుతోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదు. రూ. 4.86 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి?. సామాన్యులపైనే భారం పెరుగుతోంది.
తలసారి ఆదాయం ఎలా పెరిగిందో లెక్కలు చెప్పాలి. రాష్ట్రంలో కొంత మంది తలసరి ఆదాయం మాత్రమే పెరిగింది. పేదలు ఇళ్లు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా బిల్లులు వేస్తున్నారు. నారాయణ విద్యా సంస్థల్లో లక్షలు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో ఫీజులపై నియంత్రణ ఉండాలి అని సూచనలు చేశారు.