సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో బడ్జెట్ కేటాయింపుల విషయంలో కేంద్రం తీరుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని మాత్రం పక్కన పెట్టారు అంటూ కౌంటర్ ఇచ్చారు.
కాగా, మంత్రి కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పేదలకు ఇచ్చే పథకాలను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. కొందరి చేతుల్లోనే డబ్బులు ఉండేలా కేంద్రం పనిచేస్తున్నది. అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తేనే అభివృద్ధి సాధ్యం. దేశంలో గొప్పనాయకులు అందరూ గెలుపును మాత్రమే చూస్తూ.. అభివృద్ధిని పక్కన పెట్టారు’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment