పార్లమెంట్‌ రేపటికి వాయిదా | BJP MP Pratap Sarangi Accuses Rahul Gandhi of Pushing MP Who Fell on Him | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ఎంపీల మధ్య తోపులాట

Published Thu, Dec 19 2024 11:36 AM | Last Updated on Thu, Dec 19 2024 2:26 PM

BJP MP Pratap Sarangi Accuses Rahul Gandhi of Pushing MP Who Fell on Him

Parliament Winter Session Live Updates:

  • సభ్యుల ఆందోళనతో లోక్‌సభ రేపటికి వాయిదా 

  • రాజ్యసభ రేపటికి వాయిదా..

ఢిల్లీ : పార్లమెంట్‌లో జరిగిన తోపులాట బీజేపీ ఎంపీలు ప్రతాప్‌ చంద్ర సారంగి,ముఖేష్‌ రాజ్‌పుత్‌లు గాయపడిన ఘటనపై ఎన్డీయే కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఎన్డీయే నేతలు సిద్ధమయ్యారు.అంతకంటే ముందే పార్లమెంట్‌లో ఎంపీల మధ్య జరిగిన తోపులాటకు సంబంధించిన వీడియోల్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. 

స్పీకర్‌కు ఖర్గే లేఖ
పార్లమెంట్‌ ముఖ ద్వారం వద్ద జరిగిన తోపులాటలో తనకు గాయమైందని, విచారణ జరపాలని స్పీకర్‌ ఓంబిర్లాకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే స్పీకర్‌కు లేఖ రాశారు. 

 

ప్రధానితో కిరణ్‌ రిజుజు భేటీ
పార్లమెంట్‌లో జరిగిన తోపులాట ఘటనకు సంబంధించిన సమాచారం అందించేందుకు ప్రధాని మోదీతో పార్లమెంటరీ కమిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్లమెంట్‌లో జరిగిన నిరసన, అపై జరిగిన పరిణామల గురించి వివరిస్తున్నారు.  

పార్లమెంట్‌లో ఎంపీల తోపులాట 
పార్లమెంట్‌లో గందర గోళం నెలకొంది. అంబేద్కర్‌ను అవమానించి కాంగ్రేస్సే నంటూ బీజేపీ.. కాదు..కాదు  కమలం నేతలు అవమానించారంటూ అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్‌ ముందు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. ఎంపీలు చేట్టిన నిరసనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్‌ సిబ్బంది ఎంపీ సారంగిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రతాప్‌ సారంగిని పరామర్శించేందుకు కేంద్ర మంత్రులు ఆస్పత్రికి వెళ్లనున్నారు. 

పార్లమెంట్‌ భయట ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష,విపక్ష ఎంపీ నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను పార్లమెంట్‌ మెట్ల దగ్గర నిలబడ్డా.. ఆ సమయంలో రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టాడు. ఆ ఎంపీ వచ్చి నాపై పడ్డాడు. దీంతో నాకు గాయాలు అయ్యాయి’ అని చెప్పారు.

పార్లమెంట్‌ లోపలికి వెళ్లే హక్కు మాకుంది : రాహుల్‌
ఈ తోపులాటపై రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. నేను పార్లమెంట్‌ మెట్లపై నిల్చున్నాను. నన్ను అడ్డుకునేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నించారు. కావాలంటే మీరే చూడంటే పార్లమెంట్‌లోని కెమెరాల్లో రికార్డయి ఉంటుంది. నేను పార్లమెంటు గేటు నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకున్నారు. మల్లికార్జున్‌ ఖర్గేను నెట్టారు. పార్లమెంట్‌ లోపలికి వెళ్లే హక్కు మాకుంది. మమ్మల్ని లోపలికి పోనివ్వకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు’ అని ఆయన అన్నారు.

అంబేద్కర్‌ను అవమానించిన పార్టీ కాంగ్రెస్‌
పార్లమెంట్‌లో అధికార, విపక్షాల ఆందోళనపై తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ స్పందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించిన పార్టీ కాంగ్రెస్‌. సెంట్రల్‌ హాల్‌లో అంబేద్కర్‌ చిత్రపటం పెట్టడాన్ని వ్యతిరేకించింది. అంబేద్కర్‌కు బీజేపీ సమున్నత గౌరవం ఇచ్చింది. నిజాలు బయటపెడుతుంటే కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతుంది. అమిత్‌ షా వీడియోని వక్రీకరించి రాద్ధాంతం చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement