పేపర్‌ లీక్‌ చేస్తే కోటి ఫైన్‌.. లోక్‌సభలో కేంద్రం బిల్లు | Prevention Of Unfair Means Bill 2024 To Be Introduced In Lok Sabha - Sakshi
Sakshi News home page

Prevention Of Unfair Means Bill 2024: పేపర్‌ లీక్‌ చేస్తే కోటి ఫైన్‌.. లోక్‌సభలో కేంద్రం బిల్లు

Published Mon, Feb 5 2024 4:09 PM | Last Updated on Mon, Feb 5 2024 4:30 PM

Centre Introduced Examination Bill In To Loksabha  - Sakshi

న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి కేంద్రం ఇక చెక్‌ పెట్టనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీల వంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో పాలు పంచుకునే అధికారులు, లీకేజీకి పాల్పడే ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో కళ్లెం వేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత దీని కింద నేరం రుజువైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష,రూ. కోటి వరకు జరిమానా విధించనున్నారు.

రాజస్థాన్‌, హరియాణా, గుజరాత్‌, బిహార్‌లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగంలోనూ ప్రస్తావించారు.  

ఇదీచదవండి.. పేటీఎంపై సీబీఐ,ఈడీల మౌనం దేనికి: కాంగ్రెస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement