లోక్‌సభలో నినాదాల వివాదం.. స్పీకర్‌ కీలక ప్రకటన | Controversy Over MPs Slogans In Loksabha, Speaker's Key Announcement Inside | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో ఎంపీల నినాదాల వివాదం.. స్పీకర్‌ కీలక ప్రకటన

Published Tue, Jun 25 2024 4:24 PM | Last Updated on Tue, Jun 25 2024 5:33 PM

Controversy Over Mps Slogans In Loksabha

సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో రెండోరోజు మంగళవారం(జూన్‌25) కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణాలు చేసిన తర్వాత పలువురు ఎంపీలు చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తన ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు.

తమిళనాడులోని తిరువళ్లూర్‌ ఎంపీ శశికాంత్‌ సెంథిల్‌ రాజ్యాగం చేత పట్టుకుని తమిళ్‌లో ప్రమాణం చేశారు. ఈయన  కూడా తన ప్రమాణం ముగిసిన తర్వాత ‘ఆదివాసీలు, దళితులు, మైనారిటీల మీద వేధింపులు ఆపండి. జై భీం, జై సంవిధాన్‌’అని నినదించారు. ఈయన కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దుకు నిరసనగా అప్పట్లో తన ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 

సభలో అసదుద్దీన్‌, శశికాంత్‌ సెంథిల్‌ చేసిన నినాదాలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్‌ కలుగజేసుకుని ఎంపీలు చేసిన వివాదాస్పద నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement