
దామోదర రాజనర్సింహ, సుదర్శన్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను నియమించింది. అందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు మెదక్ బాధ్యతలు అప్పగించింది. అలాగే జహీరాబాద్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డిని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్‌రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, అందోల్(ఎస్సీ), జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండడంతో కాంగ్రెస్ ఇన్‌చార్జిలను నియమించింది.
ఇవి చదవండి: 'నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..' : ఎమ్మెల్యే పాయల్ శంకర్
Comments
Please login to add a commentAdd a comment