ఆటంకపర్వానికి అంతమెప్పుడు?
రూల్ 349 ప్రకారం తాను మాట్లాడని సమయంలో మౌనంగా ఉండాలి, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుతగలకూడదు, నినాదాలివ్వకూడదు, సభాపతి దగ్గరకు పోకూడదు, డాక్యుమెంట్లను చించకూడదు. రూల్ 356 సభాకార్యకలాపాలకు ఆటంకం కలిగించే విధంగా సభ్యులు మాట్లాడే హక్కును నిషేధిస్తున్నది. కానీ సభలో ఈ నియమాల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి.
చట్టసభలను దాని సభ్యులే ఆటంక పరచడం పరిపాటి అయింది. 16వ లోక్‌సభ సమావేశాలలో ఆటంకపర్వం ప్రారంభమైంది. 15వ లోక్ సభ ఆటంకపర్వాలలో అగ్ర స్థానం పొందింది. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆటంకపర్వం సాగించింది. ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉంది. ప్రతిపక్షంలోకి మారిన కాంగ్రెస్ ఆటంక పర్వాన్ని ఆరంభించింది. ఆటగాళ్లు, వారి పాత్రలు మారాయి కాని ఆటమాత్రం యథాతథం. ఆనాడు ఆయి ల్ ఫుడ్డు, 2జీ, బొగ్గు, క్రీడల స్కాములు, ఇప్పుడు వ్యాపం, లలిత్ గేట్ వగైరాలు. అప్పుడూ ఇప్పుడూ ఒకటే నినాదం. ముందు రాజీనామాలు, తర్వాతే సభలో చర్చ, లేకపోతే సభను నడవనివ్వం. అదే రగడ. సభను ఆటంక పరచడానికి తగిన సంఖ్యగల ఇతర పార్టీలు ఇదే బాట పడుతున్నాయి.
తొలి లోక్‌సభ (1952-57) 677 రోజుల పాటు 3,748 గంటల కార్యకలాపాలు సాగించింది. 15వ లోక్ సభ (2009-14) కేవలం 335 రోజుల పాటు 1,329 గంటల కార్యకలాపాలు సాగించి అథమ స్థానంలో ఉం ది. చట్టాల మీద చర్చల కోసం తొలి లోక్‌సభ 49 శాతం సమయాన్ని వెచ్చిస్తే,15వ లోక్‌సభ కేవలం 23 శాతాన్ని వినియోగించింది. ఆమోదించిన 162 బిల్లులలో 30 శాతం బిల్లుల మీద గంటలోపు మాత్రమే చర్చ జరిగిం ది. బీజేపీ నిత్య ఆటంకాల నిర్వాకానికి ఫలితం ఇది. 2012లో వర్షాకాల సమావేశాలను పూర్తిగా స్తంభింప చేశారు. దీనిపై సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ పార్లమెం టును స్తంభింప చెయ్యడం కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతేనన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే బాణీలో పోటీ పడుతున్నది.
పార్లమెంటు చట్టాలు చెయ్యడానికీ, ప్రజాసమస్య లను చర్చించడానికీ, పరిష్కారాలు సాధించడానికీ ఉద్దే శించింది. వాదనలకు బదులు వాకౌట్లకు, చర్చలకు బదులు అరుపులు కేకలు తోపులాటలు పోడియం ముట్టడి వంటి రచ్చలకు వేదికను చేశారు. చట్టసభలోనే చట్టాలను, నియమాలను ఉల్లంఘిస్తున్నారు. సభా నిర్వ హణకు సంబంధించిన రూల్ 349 ప్రకారం తాను మాట్లాడని సమయంలో మౌనంగా ఉండాలి, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుతగలకూడదు, నినాదాలివ్వ కూడదు, సభాపతి దగ్గరకు పోకూడదు, అసమ్మతి తెల పడానికి డాక్యుమెంట్లను చించకూడదు. రూల్ 356 సభాకార్యకలాపాలకు ఆటంకం కలిగించే విధంగా సభ్యులు మాట్లాడే హక్కును నిషేధిస్తున్నది. కానీ సభలో ఈ నియమాల ఉల్లంఘనలు జరిగిపోతూనే ఉన్నాయి. సుష్మా స్వరాజ్ చెప్పినట్లు సభను ఆటంక పరచడం ప్రజాస్వామ్య పద్ధతి కాకపోగా అది పూర్తిగా సభా నియమాల ఉల్లంఘన. ఇప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్నదీ నియమాల ఉల్లంఘనే.
ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒకే నాణేనికి బొ మ్మా బొరుసులు. చట్టాలను, నియమాలను తుంగలో తొక్కేవారికి చట్టసభలలో స్థానం ఉండకూడదు. ఇలాం టి వారిని దోషులుగా ప్రకటించి, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం కంటే సర్దిచెప్పడం, సభను వాయిదా వెయ్యడానికే సభాపతులు మొగ్గుతున్నారు. పత్రికలకు, ప్రసార మాధ్యమాలకు మైకు విరిస్తే పెద్ద వార్త అవుతు న్నది. మైకు ముందు అర్ధవంతమైన ప్రసంగం వార్త కాకుండా పోతున్నది. వాదనకు దిగలేని జీరోలు ఎంత రభస చేస్తే అంతటి హీరోలు. పార్లమెంటు సమావే శాలు నిత్య నిరసనలతో ధర్నా చౌక్‌ను తలపిస్తున్నాయి. ఈ పరిస్థితి మారితీరాలి. సభాహక్కుల సంఘం ఇలాం టి వారిని పార్లమెంటు లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోనులో ఎక్కించాలి. దోషిగా చూపించే ఈ చిత్రా లను బహిరంగ పరచాలి. వ్యక్తిగతంగా వారి జీతభత్యా లలో భారీ కోతలు, వివిధ కమిటీలలో ఉన్న సభ్యత్వాల సస్పెన్షన్‌తో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజ లకు అర్ధమయ్యే రీతిలో ఎంపీ లాడ్స్‌లో భారీ కోతలు విధించాలి. పార్లమెంటు కాలం ముగింపు సమావేశాల వెంటనే సభ్యుల ప్రవర్తనా నివేదికను ప్రకటించాలి. సభలో తన ప్రవర్తనకీ తర్వాత జరిగే ఎన్నికలకీ మధ్య ముడిపడితే తప్ప సభ్యుల తీరు మారదు. సజావుగా పార్లమెంటు కార్యకలాపాలు సాగకపోతే జరిగే దుష్ఫలి తాలు ఇప్పటికే కనిపిస్త్తున్నాయి. పార్లమెంటును పక్కన పెట్టి పాలన సాగించే అడ్డదారులను ప్రభుత్వాలు అను సరిస్తున్నాయి. ఆధార్ కార్డుల బిల్లు ఇప్పటికీ పార్లమెం టులో నానుతూనే ఉంది.
చట్టం లేకుండానే ఆధార్ కార్డులు వచ్చేశాయి. దానితో అన్ని అనుసంధానాలు జరిగిపోతున్నాయి. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం చట్టం కాకముందే అమలులోకి వచ్చేసింది. బడ్జెట్‌లలో పెంచా ల్సిన ధరలు పార్లమెంటు ప్రమేయం లేకుండా ముందూ వెనకా వడ్డింపులుగా మారాయి. ఈ ధరల నిర్ణయానికి ప్రత్యేక వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. చర్చ లేకుండానే బడ్జె ట్‌లు ఆమోదం పొందుతున్నాయి. లక్షల కోట్ల పద్దులు గిలిటిన్ అవుతున్నాయి. బడ్జెట్‌లో లేకపోయినా కొత్త పథకాలు పుట్టుకొస్తున్నాయి. వాటికి నిధులు విడుదల జరిగిపోతున్నది. పార్లమెంటు ప్రజాధికారానికి ప్రతీక. ప్రజలు ఓటు ద్వారా తమ అధికారాన్ని దఖలు పరుస్తు న్నారు. రాజ్యాంగబద్ధంగా దేశాన్ని శాసించే శక్తిగా భాసి ల్లాలి. పార్లమెంటును పక్కన పెట్టడం, నిర్వీర్యం చెయ్య డం, స్తంభింపచెయ్యడం ప్రజల సార్వభౌమాధికారం మీద దాడి తప్ప వేరు కాదు.
(వ్యాసకర్త: అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్
లోక్‌సత్తా పార్టీ) 9866074023
- డీవీవీఎస్ వర్మ