Parilament winter sessions
-
ఆటంకపర్వానికి అంతమెప్పుడు?
రూల్ 349 ప్రకారం తాను మాట్లాడని సమయంలో మౌనంగా ఉండాలి, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుతగలకూడదు, నినాదాలివ్వకూడదు, సభాపతి దగ్గరకు పోకూడదు, డాక్యుమెంట్లను చించకూడదు. రూల్ 356 సభాకార్యకలాపాలకు ఆటంకం కలిగించే విధంగా సభ్యులు మాట్లాడే హక్కును నిషేధిస్తున్నది. కానీ సభలో ఈ నియమాల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. చట్టసభలను దాని సభ్యులే ఆటంక పరచడం పరిపాటి అయింది. 16వ లోక్‌సభ సమావేశాలలో ఆటంకపర్వం ప్రారంభమైంది. 15వ లోక్ సభ ఆటంకపర్వాలలో అగ్ర స్థానం పొందింది. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆటంకపర్వం సాగించింది. ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉంది. ప్రతిపక్షంలోకి మారిన కాంగ్రెస్ ఆటంక పర్వాన్ని ఆరంభించింది. ఆటగాళ్లు, వారి పాత్రలు మారాయి కాని ఆటమాత్రం యథాతథం. ఆనాడు ఆయి ల్ ఫుడ్డు, 2జీ, బొగ్గు, క్రీడల స్కాములు, ఇప్పుడు వ్యాపం, లలిత్ గేట్ వగైరాలు. అప్పుడూ ఇప్పుడూ ఒకటే నినాదం. ముందు రాజీనామాలు, తర్వాతే సభలో చర్చ, లేకపోతే సభను నడవనివ్వం. అదే రగడ. సభను ఆటంక పరచడానికి తగిన సంఖ్యగల ఇతర పార్టీలు ఇదే బాట పడుతున్నాయి. తొలి లోక్‌సభ (1952-57) 677 రోజుల పాటు 3,748 గంటల కార్యకలాపాలు సాగించింది. 15వ లోక్ సభ (2009-14) కేవలం 335 రోజుల పాటు 1,329 గంటల కార్యకలాపాలు సాగించి అథమ స్థానంలో ఉం ది. చట్టాల మీద చర్చల కోసం తొలి లోక్‌సభ 49 శాతం సమయాన్ని వెచ్చిస్తే,15వ లోక్‌సభ కేవలం 23 శాతాన్ని వినియోగించింది. ఆమోదించిన 162 బిల్లులలో 30 శాతం బిల్లుల మీద గంటలోపు మాత్రమే చర్చ జరిగిం ది. బీజేపీ నిత్య ఆటంకాల నిర్వాకానికి ఫలితం ఇది. 2012లో వర్షాకాల సమావేశాలను పూర్తిగా స్తంభింప చేశారు. దీనిపై సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ పార్లమెం టును స్తంభింప చెయ్యడం కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతేనన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే బాణీలో పోటీ పడుతున్నది. పార్లమెంటు చట్టాలు చెయ్యడానికీ, ప్రజాసమస్య లను చర్చించడానికీ, పరిష్కారాలు సాధించడానికీ ఉద్దే శించింది. వాదనలకు బదులు వాకౌట్లకు, చర్చలకు బదులు అరుపులు కేకలు తోపులాటలు పోడియం ముట్టడి వంటి రచ్చలకు వేదికను చేశారు. చట్టసభలోనే చట్టాలను, నియమాలను ఉల్లంఘిస్తున్నారు. సభా నిర్వ హణకు సంబంధించిన రూల్ 349 ప్రకారం తాను మాట్లాడని సమయంలో మౌనంగా ఉండాలి, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుతగలకూడదు, నినాదాలివ్వ కూడదు, సభాపతి దగ్గరకు పోకూడదు, అసమ్మతి తెల పడానికి డాక్యుమెంట్లను చించకూడదు. రూల్ 356 సభాకార్యకలాపాలకు ఆటంకం కలిగించే విధంగా సభ్యులు మాట్లాడే హక్కును నిషేధిస్తున్నది. కానీ సభలో ఈ నియమాల ఉల్లంఘనలు జరిగిపోతూనే ఉన్నాయి. సుష్మా స్వరాజ్ చెప్పినట్లు సభను ఆటంక పరచడం ప్రజాస్వామ్య పద్ధతి కాకపోగా అది పూర్తిగా సభా నియమాల ఉల్లంఘన. ఇప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్నదీ నియమాల ఉల్లంఘనే. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒకే నాణేనికి బొ మ్మా బొరుసులు. చట్టాలను, నియమాలను తుంగలో తొక్కేవారికి చట్టసభలలో స్థానం ఉండకూడదు. ఇలాం టి వారిని దోషులుగా ప్రకటించి, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం కంటే సర్దిచెప్పడం, సభను వాయిదా వెయ్యడానికే సభాపతులు మొగ్గుతున్నారు. పత్రికలకు, ప్రసార మాధ్యమాలకు మైకు విరిస్తే పెద్ద వార్త అవుతు న్నది. మైకు ముందు అర్ధవంతమైన ప్రసంగం వార్త కాకుండా పోతున్నది. వాదనకు దిగలేని జీరోలు ఎంత రభస చేస్తే అంతటి హీరోలు. పార్లమెంటు సమావే శాలు నిత్య నిరసనలతో ధర్నా చౌక్‌ను తలపిస్తున్నాయి. ఈ పరిస్థితి మారితీరాలి. సభాహక్కుల సంఘం ఇలాం టి వారిని పార్లమెంటు లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోనులో ఎక్కించాలి. దోషిగా చూపించే ఈ చిత్రా లను బహిరంగ పరచాలి. వ్యక్తిగతంగా వారి జీతభత్యా లలో భారీ కోతలు, వివిధ కమిటీలలో ఉన్న సభ్యత్వాల సస్పెన్షన్‌తో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజ లకు అర్ధమయ్యే రీతిలో ఎంపీ లాడ్స్‌లో భారీ కోతలు విధించాలి. పార్లమెంటు కాలం ముగింపు సమావేశాల వెంటనే సభ్యుల ప్రవర్తనా నివేదికను ప్రకటించాలి. సభలో తన ప్రవర్తనకీ తర్వాత జరిగే ఎన్నికలకీ మధ్య ముడిపడితే తప్ప సభ్యుల తీరు మారదు. సజావుగా పార్లమెంటు కార్యకలాపాలు సాగకపోతే జరిగే దుష్ఫలి తాలు ఇప్పటికే కనిపిస్త్తున్నాయి. పార్లమెంటును పక్కన పెట్టి పాలన సాగించే అడ్డదారులను ప్రభుత్వాలు అను సరిస్తున్నాయి. ఆధార్ కార్డుల బిల్లు ఇప్పటికీ పార్లమెం టులో నానుతూనే ఉంది. చట్టం లేకుండానే ఆధార్ కార్డులు వచ్చేశాయి. దానితో అన్ని అనుసంధానాలు జరిగిపోతున్నాయి. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం చట్టం కాకముందే అమలులోకి వచ్చేసింది. బడ్జెట్లలో పెంచా ల్సిన ధరలు పార్లమెంటు ప్రమేయం లేకుండా ముందూ వెనకా వడ్డింపులుగా మారాయి. ఈ ధరల నిర్ణయానికి ప్రత్యేక వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. చర్చ లేకుండానే బడ్జె ట్లు ఆమోదం పొందుతున్నాయి. లక్షల కోట్ల పద్దులు గిలిటిన్ అవుతున్నాయి. బడ్జెట్లో లేకపోయినా కొత్త పథకాలు పుట్టుకొస్తున్నాయి. వాటికి నిధులు విడుదల జరిగిపోతున్నది. పార్లమెంటు ప్రజాధికారానికి ప్రతీక. ప్రజలు ఓటు ద్వారా తమ అధికారాన్ని దఖలు పరుస్తు న్నారు. రాజ్యాంగబద్ధంగా దేశాన్ని శాసించే శక్తిగా భాసి ల్లాలి. పార్లమెంటును పక్కన పెట్టడం, నిర్వీర్యం చెయ్య డం, స్తంభింపచెయ్యడం ప్రజల సార్వభౌమాధికారం మీద దాడి తప్ప వేరు కాదు. (వ్యాసకర్త: అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ లోక్‌సత్తా పార్టీ) 9866074023 - డీవీవీఎస్ వర్మ -
అమిత్ షా రాయని డైరీ
ఇవాళ కూడా మోదీజీ అసౌకర్యంగానే కనిపించారు. నిన్నా అంతే, మొన్నా అంతే! బహుశా రేపు, ఎల్లుండి కూడా అంతే కావచ్చు. ఎల్లుండి నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. అవి ఆయనకు లెక్కే కాదు. పైగా ‘ముఖాబ్లా’ కోసం ఉబలాటపడుతున్నట్టు మొన్న కశ్మీర్లో తనే చెప్పుకున్నారు. మరి ఎందుకని మోదీజీ అసౌకర్యంగా ఉంటున్నారు?! నేను నచ్చట్లేదా? ఆయనకు బట్టలు కుట్టే దర్జీ నచ్చట్లేదా? బిహార్‌కు అప్పుడే ఎన్నికలు రావడం నచ్చట్లేదా! తెలియడం లేదు. కళ్లజోడులోంచి ఆ చూపుల ఎక్స్ప్రెషన్స్ పట్టుకోవడం కష్టంగా ఉంటోంది. ఈ మధ్యైతే మరీను! కళ్లలోకి చూస్తారు. చూస్తూ ఉంటారు. చూసి, చూసి చివర్న.. ‘సముఝే’ అన్నట్లు చూస్తారు! ఆంతరంగిక సలహాదారుకు కూడా అంతుచిక్కని విలక్షణత్వం ప్రపంచంలో మోదీజీ ఒక్కరిదేనేమో! నేను నచ్చకపోతే నన్ను మార్చేయడం మోదీజీకి పెద్ద ఇష్యూ కాదు. ఇంకో ‘షా’ ఎవరైనా ఉంటే చూడమని నేరుగా నన్నే అడగ్గలరు ఆయన. ఏ ‘షా’ దొరక్కపోతే, కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ షా నైనా తెచ్చిపెట్టమంటారు. లేదా తెచ్చి పెట్టుకుంటారు. నా మీద ‘షా’ వేసిన సెటైర్ మోదీజీకి బాగా నచ్చినట్టుంది. ‘నువ్వూ సరదాగా ఒకటి వెయ్’ అన్నారు. ‘మాటలెందుకు మోదీజీ, బిహార్‌లో గెలిచి చూపిద్దాం’ అన్నాను. ఆ మాటకు ఆయన హర్ట్ అయినట్లున్నారు! మోదీజీది పసిహృదయం. మాటలకు పడిపోతారు. మాటలతో ఆడుకునేవారికి మనసిచ్చేస్తారు. జనవరిలో నా టెర్మ్ అయిపోతుంది. ఆలోపే రిటైర్డ్ హర్ట్ అవుతానేమోనని డౌట్. నేను హర్ట్ అవడం వల్ల కాదు. మోదీజీ హర్ట్ అవడం వల్ల! మోదీజీ నా పదవీకాలాన్ని పొడిగిస్తారా లేక అంతకుముందే నన్ను ఆలింగనం చేసుకుంటారా అన్నది బిహార్ ఫలితాలను బట్టి ఉండొచ్చు. ఎప్పుడు టెర్మ్ అయిపోయినా, వె ళ్లేటప్పుడు మోదీజీకి చెప్పాలి... నన్ను మార్చినా పర్లేదు.. దర్జీని మార్చొద్దని. గుట్టుమట్లు తెలిసిన మనిషిని వదులుకుంటే నష్టం లేదు. చుట్టు కొలతలు తెలిసిన మనిషిని కాదనుకుంటే మన షేపే మారిపోతుంది. షేప్ దెబ్బతిన్నా నష్టం లేదు. మునుపటి షేప్‌లోకి వచ్చేస్తే మోదీజీ నుండి ఒబామా మళ్లీ వీసా లాగేసుకున్నా లాగేసుకుంటాడు. టెర్మ్ అయ్యాక మోదీజీ నాకేం పోస్టు ఇస్తారో తెలీదు. పార్టీ పితృదేవులు అటల్జీ, అద్వానీ, జోషీ నా మీద గుర్రుగా ఉండి ఉంటారు... పార్లమెంటరీ బోర్డు నుంచి పీకి మార్గదర్శక్ మండల్లో పడేశా నని. ‘ఆ మండల్లోకే నువ్వు కూడా వెళ్లిపో’ అని మోదీజీ ఆజ్ఞాపిస్తే అప్పుడేం చేయాలి? ఇప్పటికి ఒక్కసారి కూడా సమావేశం కాని మండల్లోనే మిగతావారిలా మౌనగంభీరంగా ఉండిపోవడమా? లేక నా నియోజకవర్గం నారన్పురాకు వెళ్లిపోయి అచ్ఛే దిన్ కోసం ఎదురుచూడడమా? ఆలోచించాలి. - మాధవ్ శింగరాజు -
పార్లమెంటులో ‘బ్లాక్‌మనీ’రచ్చ
ఒక్కటైన ప్రతిపక్షం: నినాదాలతో హోరెత్తిన ఉభయసభలు నేడు చర్చకు అంగీకరించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల వేడిని అధికార పక్షం మొదటిరోజే చవిచూసింది. ఉభయసభలు మంగళవారం ఉదయం ప్రారంభం కావడంతోనే ‘100 రోజులు గడిచాయి.. బ్లాక్ మనీ ఎక్కడ?’ అనే నినాదాలతో హోరెత్తాయి. నల్లధనం విషయంలో బీజేపీ తన ఎన్నికల హామీని అమలు చేయడంలో విఫలమైందంటూ ప్రతిపక్షాలు ఐక్యంగా గళమెత్తాయి. బ్లాక్‌మనీని భారత్‌కు తిరిగి తెప్పించేందుకు చేపట్టిన చర్యలను సభకు వివరించాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ఈ అంశంపై బుధవారం చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అంతకుముందు లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్.. తదితర పార్టీల ఎంపీలు నల్లధనం అంశంపై సభలో నినాదాలు మొదలెట్టారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభా కార్యక్రమాలను ప్రారంభించడంతో వారు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. తృణమూల్ ఎంపీలు ‘నల్ల ధనాన్ని వెనక్కు తెండి’ అని రాసిన నల్ల గొడుగులను ప్రదర్శించారు. ఈ విషయంలో చేపట్టిన చర్యలను సభకు వివరిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినా వారు వినిపించుకోలేదు. బ్లాక్‌మనీ విషయంలో ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ సహా బీజేపీ నేతలంతా యూపీఏ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేశారని, అందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. దానికి ‘గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ బ్లాక్‌మనీ దేశం నుంచి తరలివెళ్లింది’ అని వెంకయ్య బదులిచ్చారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి బ్లాక్‌మనీపై చర్చ చేపట్టాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చిన స్పీకర్ గందరగోళం మధ్యనే క్వశ్చన్ అవర్‌ను ప్రారంభించారు. మరోవైపు రాజ్యసభలోనూ తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, జేడీయూ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభ కార్యకలాపాలను కూడా అడ్డుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రీన్ నల్లధనం అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం బ్లాక్‌మనీని వెనక్కు తెస్తుందని ప్రజలు ఆశించినా ఆ హామీని సర్కారు నిలుపుకోవడంలేదని విమర్శించారు. అయితే దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఉభయ సభల్లో బిల్లులు * నాలుగు ట్రిపుల్ ఐటీ(అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కంచీపురం)ల యాజమాన్యాలను ఒకే ఛత్రం కిందకు తెచ్చే ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ బిల్, 2014’ను మానవ వనరుల శాఖ మంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును టీఆర్ఎస్ ఎంపీ కవిత సహా ఎంపీలంతా స్వాగతించారు. * ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ మధ్యనే సీబీఐ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. * యూజీసీ, ఏఐసీటీఈ వంటి నియంత్రణ సంస్థల స్థానంలో ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ది హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బిల్, 2011’ను మోదీ ప్రభుత్వం రాజ్యసభ నుంచి ఉపసంహరించింది. నల్లధనం ఎంతో ఎవరికీ తెలియదు: ఆర్బీఐ గవర్నర్ విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం ఎంతో ఎవరకీ తెలియకున్నా ఈ విషయంలో ఊహాగానాలు సాగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మంగళవారం గుజరాత్‌లోని ఆనంద్‌లో చెప్పారు. ఆదా యపు పన్ను రేట్లను మరింత తగ్గించడం ద్వారా అక్రమ నిధుల పుట్టుకను అరికట్టవచ్చన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎగువ తరగతివారికి ప్రోత్సాహకరంగా ఉండేలా పన్నురేట్లు తగ్గించాల్సి ఉందన్నారు. ‘కార్మిక’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం కార్మిక చట్టాల సరళీకరణకు సంబంధించిన సవరణ బిల్లు (ద లేబర్ లా అమెండ్మెంట్ బిల్-2011)ను రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లును సభలో కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రవేశపెట్టారు. 40 మంది వరకు ఉద్యోగులున్న పరిశ్రమలు, సంస్థల విషయంలో కార్మిక చట్టాల సరళీకరణకు ఉద్దేశించిన బిల్లు అది. పారదర్శకతకు, జవాబుదారీతనానికి, నిబంధనల కచ్చితమైన అమలుకు.. పెద్దపీట వేసేలా సవరణలను రూపొందించామని దత్తాత్రేయ తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కలిగించేలా.. రిటర్న్ దాఖలులో, రిజిస్టర్ల నిర్వహణలో కొన్ని వెసులుబాట్లను బిల్లులో పొందుపర్చారు. చిన్న తరహా పరిశ్రమ నిర్వచనాన్ని కూడా మార్చారు. 10 మందికి తగ్గకుండా.. 40 మందికి మించకుండా ఉద్యోగులు/కార్మికులు ఉన్న సంస్థ/ పరిశ్రమ ఆ కేటగిరీలో ఉంటుంది. ఈ బిల్లులోని నిబంధనలు కార్మికులకు వ్యతిరేకంగా, వారికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ ఎంపీ మధుసూదన్ మిస్త్రీ, సీపీఎం ఎంపీ తపన్‌కుమార్ సేన్, సీపీఐ ఎంపీ డి. రాజా, జేడీయూ ఎంపీ కేసీ త్యాగి దీనిపై జరిగిన చర్చలో ఆరోపించారు. అనంతరం వామపక్ష, జేడీయూ ఎంపీల నిరసనల మధ్యనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. బిల్లుపై ఓటింగ్‌లో అనుకూలంగా 49 మంది, వ్యతిరేకంగా 19 మంది ఓటేశారు. శివసేన సైతం బిల్లుకు మద్దతిచ్చింది.