ఆసియా క్రీడల్లో భారత్ ఆరో రోజు మూడు పతకాలను సాధించింది.
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ ఆరో రోజు మూడు పతకాలను సాధించింది. రోయింగ్ విభాగంలో రెండు, షూటింగ్ విభాగంలో మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆసియా క్రీడల్లో షూటింగ్ లో భారత్ కు కాంస్యం లభించింది. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్ లో భారత్ కు ఈ పతకం దక్కింది. షూటింగ్లో భాతర్ కు ఇది ఏడో పతకం కావటం విశేషం. రోయింగ్ పురుషుల సింగిల్స్లో సవర్ణ సింగ్కు కాస్యం, రోయింగ్ మెన్స్ 8వ విభాగంలో మరో కాంస్యంతో పాటు మహిళల డబుల్ ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత్ కాంస్యాన్ని సాధించింది.