సాక్షి, పశ్చిమగోదావరి: పీవీ సింధు కాంస్య పతకం సాధించిన అనంతరం ఆమె తండ్రి పీవీ వెంకట రమణ పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన రాట్నాలమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా పూర్వీకుల నుంచి మాకుల దేవతగా రాట్నాలమ్మను పూజిస్తున్నాము.
టోర్నమెంట్‌కు వెళ్లే ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకుని సింధు ఆడేందుకు వెళ్లిందని, అమ్మ దయతో దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చిందన్నారు.130 కోట్ల భారతీయుల ఆశీస్సులతో పాటు ,అమ్మ దీవెనతో మెడల్ సాధించిందని తెలిపారు. ఒలింపిక్స్ లో ఆడటం గొప్ప అవకాశం..అది అందరికీ రాదని, అమ్మాయిలలో రెండో సారి ఒలింపిక్స్ లో మెడల్ పొందిన వారిలో సింధు మొదటి యువతి కావడం ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒలింపిక్స్కు వెళ్ళే ముందు క్యాంపు కార్యాలయంకు పిలిపించి సింధు, సాత్విక్ ,హాకీ క్రీడాకారులను సన్మానించి, మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ప్రోత్సాహించారని చెప్పారు.
‘అమ్మ దయతో సింధు మెడల్ గెలిచింది’
Published Mon, Aug 2 2021 2:20 PM | Last Updated on Mon, Aug 2 2021 2:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment