PV Sindhu Parents
-
‘అమ్మ దయతో సింధు మెడల్ గెలిచింది’
సాక్షి, పశ్చిమగోదావరి: పీవీ సింధు కాంస్య పతకం సాధించిన అనంతరం ఆమె తండ్రి పీవీ వెంకట రమణ పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన రాట్నాలమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా పూర్వీకుల నుంచి మాకుల దేవతగా రాట్నాలమ్మను పూజిస్తున్నాము. టోర్నమెంట్‌కు వెళ్లే ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకుని సింధు ఆడేందుకు వెళ్లిందని, అమ్మ దయతో దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చిందన్నారు.130 కోట్ల భారతీయుల ఆశీస్సులతో పాటు ,అమ్మ దీవెనతో మెడల్ సాధించిందని తెలిపారు. ఒలింపిక్స్ లో ఆడటం గొప్ప అవకాశం..అది అందరికీ రాదని, అమ్మాయిలలో రెండో సారి ఒలింపిక్స్ లో మెడల్ పొందిన వారిలో సింధు మొదటి యువతి కావడం ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఒలింపిక్స్‌కు వెళ్ళే ముందు క్యాంపు కార్యాలయంకు పిలిపించి సింధు, సాత్విక్ ,హాకీ క్రీడాకారులను సన్మానించి, మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ప్రోత్సాహించారని చెప్పారు. -
పీవీ సింధు తల్లిదండ్రులతో ఇంటర్వ్యూ
-
'సింధు తప్పకుండా గెలుస్తుంది'
హైదరాబాద్: రియో ఒలింపిక్స్ లో తమ కుమార్తె పతకం సాధిస్తుందని బ్యాడ్మింటర్ స్టార్ పీవీ సింధు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం జరిగే సెమీఫైనల్లో సింధు విజయం సాధించాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 'కచ్చితంగా సింధు గెలవాలని కోరుకుంటున్నాం. ఆమెతో మాట్లాడాను. ఆటపైనే దృష్టి పెట్టమని చెప్పాను. సెమీఫైనల్లో ఆమె విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం. పతకంతో తిరిగొస్తుందన్న విశ్వాసంతో ఉన్నామ'ని రమణ అన్నారు. తమ కుమార్తె సెమీస్ చేరడం సంతోషంగా ఉందని సింధు తల్లి విజయ అన్నారు. తాను ఆడిన మొదటి ఒలింపిక్స్ లోనే సింధు సెమీఫైనల్ చేరడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. రేపు జరగనున్న సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నజోమి ఒకుహరాతో తలపడనుంది. అయితే ఒకుహరా కేడా మంచి ప్లేయర్ అని, ఆమెతో మ్యాచ్ అంత ఈజీ కాదని రమణ పేర్కొన్నారు. రేపు ఎవరు బాగా ఆడతారనే దానిపై విజయావకాశాలు ఆధారపడివుంటాయని చెప్పారు.