సాక్షి, గుంటూరు,హనుమాన్‌జంక్షన్ రూరల్: హనుమాన్‌జంక్షన్‌లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు శుక్రవారం సందర్శించారు. ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. అనంతరం పి.వి.సింధు అంజనీపుత్రుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెతో పాటు తండ్రి పి.వి.రమణ, తల్లి విజయ కూడా ఉన్నారు. íసింధుకు దేవాదాయ అధికారులు అభయాంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించారు.
Comments
Please login to add a commentAdd a comment