
శ్రీనివాసరావుకు రెండు పతకాలు
జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వల్లూరి శ్రీనివాసరావు రెండు పతకాలు సాధించాడు. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో మంగళవారం జరిగిన పురుషుల 62 కేజీల విభాగంలో శ్రీనివాసరావు కాంస్యంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు.
శ్రీనివాసరావు స్నాచ్‌లో 112 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 143 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 255 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. అంతర్ రాష్ట్ర విభాగంలో శ్రీనివాసరావు (255 కేజీలు) స్వర్ణం సొంతం చేసుకోగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గౌరి బాబు (246 కేజీలు) కాంస్య పతకాన్ని సంపాదించాడు.