చిత్రకు కాంస్యం | Chitra settles for bronze at ISBF World snooker | Sakshi
Sakshi News home page

చిత్రకు కాంస్యం

Published Mon, Dec 9 2013 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

చిత్రకు కాంస్యం

చిత్రకు కాంస్యం

 డాగాపిల్స్ (లాత్వియా): ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి చిత్ర మగిమైరాజన్ కాంస్య పతకాన్ని సాధించింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో చిత్ర 1-4 (75-29, 60-66, 23-65, 0-74, 33-66) ఫ్రేమ్‌ల తేడాతో వెండీ జాన్స్ (బెల్జియం) చేతిలో ఓడిపోయింది. ఈ పోటీలో సెమీఫైనల్లో ఓడిపోయిన వారికి కాంస్య పతకాలు ఇస్తారు. వెండీ జాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్ర తొలి ఫ్రేమ్‌ను గెల్చుకున్నా ఆ తర్వాత అదేస్థాయి ఆటతీరును కనబర్చలేకపోయింది. వచ్చే ఏడాది  ఈ మెగా ఈవెంట్‌కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement