కాంస్య పతకం సాధించిన విజయవాడ అమ్మాయి కాజోల్ సునార్
విజయవాడ స్పోర్ట్స్: మూడో 11స్పోర్ట్స్ జాతీయ ఇంటర్ స్కూల్స్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో నగరంలోని మద్ది సుబ్బారావు ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు చెందిన విజయవాడ అమ్మాయి కాజోల్ సునార్ సీనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. నగరంలోని దండమూడి రాజగోపాలరావు స్టేడియంలో ఆదివారం జరిగిన టోర్నీలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన స్కూల్ జట్లు పూర్తి ఆధిక్యత ప్రదర్శించాయి. సీనియర్ బాలికల విభాగం సెమీస్‌లో కాజోల్ సునార్ 1–3 తేడాతో ఎస్.రాధాప్రియాగోయల్ (డీపీఎస్, యూపీ)పై ఓటమి చెంది కాంస్య పతకం సాధించింది. సీనియర్ బాలికల ఫైనల్స్‌లో జూనియర్ వరల్డ్ సర్కూట్ కాంస్య పతకం విజేతైన రాధాప్రియా గోయల్ (డీపీఎస్, యూపీ)ను 0–3 తేడాతో పొయమ్తీబైస్యా (మఖాల విద్యానికేతన్, పశ్చిమబెంగాల్) ఓడించింది. సీనియర్ బాలుర విభాగం ఫైనల్‌లో చిన్మయి సోమయ (మయూర్ స్కూల్, రాజస్థాన్) 3–2 తేడాతో అకాష్‌పాల్ (అమరేంద్ర విద్యాపీఠ్, పశ్చిమబెంగాల్)పై విజయం సాధించాడు.
జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో కర్ణాటకకు చెందిన శ్రీకుమరన్ చిల్డ్రన్స్ హోం జట్టుకు చెందిన సుజన్ భరద్వాజ్ 3–2 తేడాతో అదే స్కూల్‌కు చెందిన శ్రీకాంత్ కాశ్యప్‌పై స్వర్ణపతకం సాధించాడు. జూనియర్ బాలికల సింగిల్స్‌లో పీఎస్ సీనియర్ సెకండరీ స్కూల్(తమిళనాడు)కు చెందిన ఎస్.హృతిక 3–0 తేడాతో సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ (యూపీ)కు చెందిన వర్టికా భరత్‌పై విజయం సాధించింది. టోర్నీ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు ట్రోపీలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, ఏపీ టేబుల్ టెన్నిస్ వెటరన్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతా రవికుమార్, 11స్పోర్ట్స్ డైరెక్టర్ కమలేష్ మెహతా, రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్‌ఎం సుల్తాన్, ఉపాధ్యక్షుడు విశ్వనాథ్, జిల్లా అ«ధ్యక్ష కార్యదర్శులు కేవీఎస్ ప్రకాష్, కె.బలరామ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment