table tennis tournament
-
అల్టిమేట్ టీటీ లీగ్.. దబంగ్ ఢిల్లీ తరఫున బరిలోకి ఆకుల శ్రీజ
Ultimate TT League 2023- పుణే: మూడేళ్ల తర్వాత అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) లీగ్ నాలుగో సీజన్‌కు గురువారం(జూలై 13) తెర లేవనుంది. మొత్తం ఆరు జట్లు బరిలో ఉన్నాయి. చెన్నై లయన్స్, దబంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్, యు ముంబా, బెంగళూరు స్మాషర్స్, గోవా చాలెంజర్స్ ఈ లీగ్‌లో పాల్గొననున్నాయి. ఇక ఈనెల 30న ఫైనల్‌తో లీగ్ ముగుస్తుంది. తెలంగాణ క్రీడాకారులు ఆకుల శ్రీజ దబంగ్ ఢిల్లీ తరఫున, సూరావజ్జుల స్నేహిత్ పుణేరి పల్టన్ తరఫున ఆడుతున్నారు. తొలిరోజు చెన్నై లయన్స్‌తో పుణేరి పల్టన్ తలపడుతుంది. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే మ్యాచ్‌లను స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జ్ఞానేశ్వరికి స్వర్ణ పతకం కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల 49 కేజీల విభాగంలో భారత ప్లేయర్ జ్ఞానేశ్వరి యాదవ్ స్వర్ణ పతకం సాధించింద. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జ్ఞానేశ్వరి మొత్తం 176 కేజీలు బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్‌కే చెందిన జిలీ దలబెహెరా రజత పతకం గెలిచింది. మహిళల 45 కేజీల విభాగంలో కోమల్... పురుషుల 55 కేజీల విభాగంలో ముకుంద్ అహిర్ భారత్‌కు స్వర్ణ పతకాలు అందించారు. -
PV Sindhu: సింధు శుభారంభం
కాల్గరీ: కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సింధు 21–16, 21–9తో తాలియా ఎన్జీ (కెనడా)పై విజయం సాధించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుతి్వక శివాని 12–21, 3–21తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. లక్ష్య సేన్ 21–18, 21–15తో రెండో సీడ్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించగా... సాయిప్రణీత్ 12–21, 17–21తో వైగోర్ కొల్హో (బ్రెజిల్) చేతిలో ఓడిపోయాడు. మనిక ముందంజ లుబ్లియానా (స్లొవేనియా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెండర్ లుబ్లియానా టోరీ్న లో భారత నంబర్‌వన్ మనిక బత్రా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో మనిక 11–4, 11–9, 11–7తో ప్రపంచ 15వ ర్యాంకర్ చెంగ్ ఐ చింగ్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించింది. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయింది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో శ్రీజ 9–11, 8–11, 11–9, 9–11తో భారత సంతతికి చెందిన ఫ్రాన్స్ క్రీడాకారిణి ప్రీతిక చేతిలో ఓడిపోయింది. -
సింగపూర్ స్మాష్ టోర్నీలో ఆకుల శ్రీజ ముందంజ
సింగపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’ బెర్త్‌కు విజయం దూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి మ్యాచ్‌లో జాతీయ చాంపియన్ శ్రీజ 11–5, 8–11, 11–8, 12–10తో చార్లోటి లుట్జ్ (ఫ్రాన్స్)పై గెలిచింది. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జూ చెన్హుయ్తో శ్రీజ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో శ్రీజ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు చేరుకుంటుంది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక ఓటమి
గోవాలో జరుగుతున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు మనిక బత్రా, సుతీర్థ ముఖర్జీ ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు . 34వ ర్యాంకర్ మనిక బత్రా 6–11, 3–11, 11–9, 7–11తో 20వ ర్యాంకర్ కియాన్ తియాని (చైనా) చేతిలో... సుతీర్థ 5–11, 7–11, 5–11తో ఫు యు (పోర్చుగల్) చేతిలో ఓడిపోయారు. -
ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ పోటీలకు శ్రీజ అర్హత
World Table Tennis Championships: దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది మే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పోటీలకు మహిళల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా అర్హత పొందారు. దోహాలో జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరి ఈ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్... పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్.. మిక్స్డ్ డబుల్స్‌లో మనిక బత్రా–సత్యన్ కూడా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందారు. ఇది కూడా చదవండి: బోపన్న, రామ్‌కుమార్ జోడీలు ఓటమి అడిలైడ్ ఓపెన్ ఇంటర్నేషనల్–2 ఏటీపీ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)... రామ్‌కుమార్ (భారత్)–రేయస్ వరేలా (మెక్సికో) జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ బోపన్న–ఎబ్డెన్ 6–7 (4/7), 5–7తో నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)–టిమ్ ప్యూయెట్జ్ (జర్మనీ) చేతిలో... రామ్–వరేలా 3–6, 4–6తో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–రోజర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. చదవండి: Ind Vs NZ- Uppal: హైదరాబాద్‌లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని? శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లకు ఛాన్స్.. ఎవరిపై వేటు..? -
టీటీలో కోటి ఆశలతో...
దాదాపు ఏడాదిన్నర క్రితం... జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్... పురుషుల రెండో రౌండ్లో 18 ఏళ్ల కుర్రాడు భారత టీటీ దిగ్గజం ఆచంట శరత్ కమల్‌ను బోల్తా కొట్టించాడు. 9 సార్లు జాతీయ చాంపియన్... ‘ట్రిపుల్ ఒలింపియన్’... తను ఆరాధించే ఆటగాడు అయిన శరత్ కమల్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఆ కుర్రాడే తెలంగాణకు చెందిన ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్. అలాంటి అరుదైన విజయంతోనే ఆగిపోకుండా మరింత పట్టుదలతో శ్రమించిన స్నేహిత్ ఇటీవల తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో కాంస్యం సాధించాడు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 49 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన స్నేహిత్... రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ లక్ష్యంగా తన అడుగులు వేస్తున్నాడు. సాక్షి క్రీడా విభాగం ఏడేళ్ల వయసులో టేబుల్ టెన్నిస్‌లో ఓనమాలు నేర్చుకున్న స్నేహిత్ వివిధ వయో విభాగాల్లో నిలకడగా రాణిస్తూ వేగంగా దూసుకుపోయాడు. జాతీయ స్థాయిలో వరుస విజయాలు నమోదు చేసిన అనంతరం 2014లో క్యాడెట్ విభాగంలో తొలి అంతర్జాతీయ టైటిల్‌తో అతను అందరి దృష్టిలో పడ్డాడు. ఇస్లామాబాద్‌లో జరిగిన దక్షిణాసియా పోటీల్లో స్నేహిత్ రజత పతకం సాధించాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకున్న అనంతరం 2017 స్నేహిత్ కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. జోర్డాన్‌లో జరిగిన ఐటీటీఎఫ్ వరల్డ్ జూనియర్ సర్క్యూట్ ఓపెన్ టోర్నమెంట్లో అతను సింగిల్స్ లో స్వర్ణం సహా మూడు పతకాలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఈ హైదరాబాద్ ప్యాడ్లర్ జూనియర్ స్థాయిలో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్లొవేనియా, మయన్మార్, ఇండియన్ ఓపెన్, జూనియర్ నేషనల్స్‌తో పాటు ఆలిండియా ర్యాంకింగ్ టోర్నమెంట్లలో అతను వరుసగా పతకాలు సాధించాడు. వివిధ అంతర్జాతీయ టోర్నీలలో 20 పతకాలు అతని ఖాతాలో చేరాయి. ఫిట్నెస్ను మెరుగుపర్చుకొని... జూనియర్ విభాగంలో రెండు ప్రపంచ చాంపియన్ షిప్‌లలో (ఇటలీ, ఆస్ట్రేలియా) కూడా పాల్గొన్న 20 ఏళ్ల స్నేహిత్... జాతీయ స్థాయిలో కేడెట్, సబ్ జూనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో వరుసగా ప్రతీ ఏడాది టాప్–4 ర్యాంక్‌లో కొనసాగాడు. అతని కెరీర్‌ను తీర్చి దిద్దడంలో కోచ్ సోమ్‌నాథ్ ఘోష్ కీలకపాత్ర పోషించాడు. వరుసగా ఏడేళ్ల పాటు ఘోష్ శిక్షణలో రాటుదేలిన స్నేహిత్ జూనియర్ స్థాయిలో నిలకడగా రాణించాడు. చెన్నైకి చెందిన ఎస్.రామన్ వద్ద కూడా స్వల్పకాలం పాటు శిక్షణ పొందగా... 2015లో మాజీ ప్రపంచ చాంపియన్ పీటర్ కార్ల్సన్ వద్ద స్వీడన్లో రెండు నెలల పాటు కోచింగ్ తీసుకోవడం అతని కెరీర్‌కు మేలు చేసింది. ఇప్పుడు కోచ్ ఘోష్‌తో పాటు ఫిజియో హిరాక్ బాగ్చీ స్నేహిత్‌ను తీర్చిదిద్దారు. ముఖ్యంగా జూనియర్ స్థాయి నుంచి సీనియర్ విభాగంలో పోటీ పడే దశలో వచ్చే ప్రతికూలతలకు అధిగమించేలా చేసి అతడిని ఫిట్‌గా తీర్చిదిద్దడంలో బాగ్చీ కీలక పాత్ర పోషించారు. శరత్ కమల్‌తో సాధన అనంతరం... ర్యాంకింగ్ టోర్నీలో శరత్ కమల్‌పై గెలిచిన తర్వాత స్నేహిత్‌కు అనూహ్య ఫలితాలు వచ్చాయి. వరుసగా ఐదు టోర్నీల్లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఈ దశలో మానసికంగా బలహీనపడి టోర్నీల్లో పోటీ పడటం కష్టంగా మారింది. అయితే 2019 డిసెంబర్లో జమ్మూలో జరిగిన యూత్ నేషనల్స్ టోర్నీ స్నేహిత్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దీని కోసం కఠోర సాధన చేసిన అతను చివరకు ఫలితం సాధించాడు. యూత్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలవడంతో టీమ్ విభాగంలో రజతం కూడా దక్కింది. ఇదే విజయం సీనియర్ స్థాయిలో సత్తా చాటేందుకు కావాల్సిన ప్రేరణను కూడా కల్పించింది. లాక్డౌన్ సమయంలో శరత్ కమల్ స్వయంగా కొందరు యువ ఆటగాళ్లను ఆహ్వానించి వారితో కలిసి సాధన చేశాడు. అది కూడా స్నేహిత్‌కు ఉపయోగపడింది. ఇప్పుడు సీనియర్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి అతను కొత్త ఘనతను నమోదు చేశాడు. తల్లిదండ్రుల అండతో... చాలా మంది వర్ధమాన ఆటగాళ్లలాగే స్నేహిత్ తల్లిదండ్రులు సూరావజ్జుల రాము, హేమ కూడా తమ అబ్బాయిని చాంపియన్‌గా తీర్చిదిద్దడంలో ఎంతో శ్రమించారు. టోర్నీలో పాల్గొనేందుకు పెద్ద మొత్తంలో సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు ప్రైవేట్ స్పాన్సర్ల నుంచి గానీ ఎలాంటి సహకారం లేకపోవడంతో కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఎలాగైనా స్నేహిత్‌ను టీటీలో మేటిగా తీర్చిదిద్దాలనే సంకల్పం, పట్టుదలతో వారు ఈ ప్రతికూలతలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం స్నేహిత్‌కు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) స్టయిఫండ్ అందిస్తుండగా... ‘ఖేలో ఇండియా’ తరఫు నుంచి శిక్షణ లభిస్తోంది. స్నేహిత్‌కు సన్మానం... జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన స్నేహిత్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు జయేశ్ రంజన్... తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే మంచి క్రీడా పాలసీ తేనుందని... దీని ద్వారా అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత టీటీ సమాఖ్య ఉపాధ్యక్షుడు ప్రకాశ్‌రాజు, స్నేహిత్ కోచ్ సోమ్‌నాథ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నేషనల్స్‌లో పతకం సాధించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. ఈ స్థాయిలో నేనూ నిలబడగలననే నమ్మకాన్ని కలిగించింది. అయితే ఇది చిరు ఆనందం మాత్రమే. నా అసలు లక్ష్యాలు ముందున్నాయి. వాటిని నెరవేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. ముఖ్యంగా నా ఆటతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నా ఫిట్నెస్ను కూడా మెరుగుపర్చుకున్నా. ముఖ్యంగా వచ్చే రెండేళ్లలో కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించాల్సి ఉంది. ఆపై 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆడాలని కోరుకుంటున్నా. – ‘సాక్షి’తో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ -
జూన్ 30 వరకు టోర్నీలు రద్దు
న్యూఢిల్లీ: కరోనా కల్లోలానికి వాయిదా లేదా రద్దవుతోన్న క్రీడల జాబితాలో తాజాగా టేబుల్ టెన్నిస్ (టీటీ) కూడా చేరింది. కరోనా ప్రభావంతో జూన్ 30 వరకు జరగాల్సిన అన్ని అంతర్జాతీయ ఈవెంట్లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రకటించింది. అంతేకాకుండా ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో జూన్ 30 వరకు ఎలాంటి మార్పులు చేయరాదని, మార్చి నెలలో ఉన్న ర్యాంక్లనే కొనసాగించాలని నిర్ణయించింది. ‘కరోనా కారణంతో ఏర్పడిన అనిశ్చితి వలన ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మేము కఠిన నిర్ణయాలను తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. జూన్ 30 వరకు జరగాల్సిన అన్ని ఐటీటీఎఫ్ టోర్నీలను రద్దు చేస్తున్నాం’ అని తమ ప్రకటనలో ఐటీటీఎఫ్ తెలిపింది. -
మెయిన్ ‘డ్రా’కు తెలంగాణ జట్లు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణ పురుషుల, మహిళల జట్లు మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాయి. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో మంగళవారంతో లీగ్ దశ టీమ్ మ్యాచ్‌లు ముగిశాయి. గ్రూప్ ‘డి’లో తెలంగాణ పురుషుల జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఆరు పాయింట్లతో గ్రూప్ ‘టాపర్’గా నిలిచింది. స్నేహిత్, మొహమ్మద్ అలీ, అమన్లతో కూడిన తెలంగాణ జట్టు తొలి మ్యాచ్‌లో 3–1తో ఉత్తరప్రదేశ్‌పై, రెండో మ్యాచ్‌లో 3–1తో హిమాచల్‌ప్రదేశ్‌పై, మూడో మ్యాచ్‌లో 3–0తో మేఘాలయపై గెలుపొందింది. మహిళల విభాగంలో గ్రూప్ ‘ఇ’లో వరుణి జైస్వాల్, గార్లపాటి ప్రణీత, మోనికా మనోహర్‌లతో కూడిన తెలంగాణ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి ఆరు పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ జట్టు వరుసగా 3–0తో రాజస్తాన్‌పై, 3–0తో హిమాచల్‌ప్రదేశ్‌పై, 3–0తో పాండిచ్చేరిపై గెలిచాయి. -
సత్యన్ పరాజయం
చెంగ్డూ (చైనా): ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ సత్యన్ జ్ఞానశేఖరన్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్ సత్యన్ 11–7, 8–11, 5–11, 9–11, 8–11తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, రెండుసార్లు ప్రపంచ కప్ చాంపియన్‌గా నిలిచిన టిమో బోల్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌ను నెగ్గిన సత్యన్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు. ‘మ్యాచ్ ముగిశాక చైనా ప్రేక్షకులందరూ చప్పట్లతో నన్ను అభినందించారు. ఈ దృశ్యం ఈ టోరీ్నలో నా ఆటతీరును చాటిచెప్పింది’ అని సత్యన్ వ్యాఖ్యానించాడు. ప్రిక్వార్టర్స్‌లో ఓడిన సత్యన్‌కు 7000 డాలర్ల (రూ. 5 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. -
‘ప్రతి జిల్లాలో సీఎం కప్ నిర్వహిస్తాం’
సాక్షి, విశాఖ : రాష్ట్ర టేబుల్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్‌ను క్రీడల, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, విశాక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. జిల్లాలోని స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. జిల్లాలోని అగనంపూడిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఒత్తిడిని అధిగమించడానికి క్రీడాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి జిల్లాలో అన్ని క్రీడల్లో సీఎం కప్ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించామని అన్నారు, అన్ని సదుపాయాలతో ప్రతి జిల్లాలో స్పర్ట్స్‌కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖలో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు జరగడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జపాన్ దేశపు ప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
విజేతలు సరోజ్ సిరిల్, వరుణి జైస్వాల్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ ఎంవీ శ్రీధర్ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ), వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) విజేతలుగా నిలిచారు. ఖైరతాబాద్ వేదికగా ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో సరోజ్ 12–10, 8–11, 3–11, 11–6, 11–5, 6–11, 11–7తో వరుణ్ శంకర్ (ఎంఎల్ఆర్)పై గెలుపొందగా... వరుణి 11–3, 11–9, 11–5, 11–4తో రాగనివేదిత (జీటీటీఏ)ను ఓడించింది. యూత్ విభాగంలో మొహమ్మద్ అలీ, జి. ప్రణీత టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు. ఫైనల్లో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 11–5, 8–11, 11–5, 11–6, 11–7తో అలీ మొహమ్మద్‌పై, ప్రణీత 12–10, 11–9, 9–11, 6–11, 11–9, 13–11తో వరుణి (జీఎస్ఎం)పై గెలుపొందారు. సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో జషాన్ సాయి (ఎంఎల్ఆర్) 4–11, 11–8, 11–9, 11–9, 11–5తో కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై నెగ్గాడు. బాలికల తుదిపోరులో పలక్ (జీఎస్ఎం) 6–11, 11–7, 11–8, 12–10, 11–5తో అనన్య (జీఎస్ఎం)ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. పోటీల అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి. వినోద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
స్వర్ణం నెగ్గిన శ్రీజ
రాంచీ: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆర్బీఐకు ప్రాతి నిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ స్వర్ణ పతకాన్ని సాధించింది. మిక్స్డ్ డబుల్స్ విభాగం ఫైనల్లో శ్రీజ–రాజ్ మోండల్ (ఆర్బీఐ) ద్వయం 3–2తో ఆకాశ్–అంకిత (బెంగాల్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో శరత్ కమల్ ఎనిమిదోసారి విజేతగా నిలిచి కమలేశ్ మెహతా పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. -
టీటీలో కాజోల్కు కాంస్యం
విజయవాడ స్పోర్ట్స్: మూడో 11స్పోర్ట్స్ జాతీయ ఇంటర్ స్కూల్స్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో నగరంలోని మద్ది సుబ్బారావు ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు చెందిన విజయవాడ అమ్మాయి కాజోల్ సునార్ సీనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. నగరంలోని దండమూడి రాజగోపాలరావు స్టేడియంలో ఆదివారం జరిగిన టోర్నీలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన స్కూల్ జట్లు పూర్తి ఆధిక్యత ప్రదర్శించాయి. సీనియర్ బాలికల విభాగం సెమీస్‌లో కాజోల్ సునార్ 1–3 తేడాతో ఎస్.రాధాప్రియాగోయల్ (డీపీఎస్, యూపీ)పై ఓటమి చెంది కాంస్య పతకం సాధించింది. సీనియర్ బాలికల ఫైనల్స్‌లో జూనియర్ వరల్డ్ సర్కూట్ కాంస్య పతకం విజేతైన రాధాప్రియా గోయల్ (డీపీఎస్, యూపీ)ను 0–3 తేడాతో పొయమ్తీబైస్యా (మఖాల విద్యానికేతన్, పశ్చిమబెంగాల్) ఓడించింది. సీనియర్ బాలుర విభాగం ఫైనల్లో చిన్మయి సోమయ (మయూర్ స్కూల్, రాజస్థాన్) 3–2 తేడాతో అకాష్పాల్ (అమరేంద్ర విద్యాపీఠ్, పశ్చిమబెంగాల్)పై విజయం సాధించాడు. జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో కర్ణాటకకు చెందిన శ్రీకుమరన్ చిల్డ్రన్స్ హోం జట్టుకు చెందిన సుజన్ భరద్వాజ్ 3–2 తేడాతో అదే స్కూల్‌కు చెందిన శ్రీకాంత్ కాశ్యప్‌పై స్వర్ణపతకం సాధించాడు. జూనియర్ బాలికల సింగిల్స్‌లో పీఎస్ సీనియర్ సెకండరీ స్కూల్(తమిళనాడు)కు చెందిన ఎస్.హృతిక 3–0 తేడాతో సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ (యూపీ)కు చెందిన వర్టికా భరత్‌పై విజయం సాధించింది. టోర్నీ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు ట్రోపీలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, ఏపీ టేబుల్ టెన్నిస్ వెటరన్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతా రవికుమార్, 11స్పోర్ట్స్ డైరెక్టర్ కమలేష్ మెహతా, రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఎం సుల్తాన్, ఉపాధ్యక్షుడు విశ్వనాథ్, జిల్లా అ«ధ్యక్ష కార్యదర్శులు కేవీఎస్ ప్రకాష్, కె.బలరామ్ పాల్గొన్నారు. -
వరుణి జైశ్వాల్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుణి జైశ్వాల్ ఆకట్టుకుంది. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో ఆమె యూత్ బాలికల, మహిళల విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను దక్కించుకుంది. బాలుర విభాగంలో మొహమ్మద్ అలీ కూడా జూనియర్ బాలుర, పురుషుల కేటగిరీల్లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన యూత్ బాలికల ఫైనల్లో వరుణి జైశ్వాల్ (జీఎస్ఎం) 13–11, 10–12, 9–11, 16–14, 11–8, 11–6తో ప్రణీత (హెచ్‌వీఎస్)పై, మహిళల విభాగంలో వరుణి11–9, 11–8, 8–11, 11–2, 11–9తో మోనికా (జీఎస్ఎం)పై గెలుపొందింది. జూనియర్ బాలికల విభాగంలో వి. సస్య (ఎంఎల్ఆర్) 6–11, 12–10, 11–6, 9–11, 11–7, 11–7తో లాస్య (ఎంఎల్ఆర్)పై నెగ్గింది. మరోవైపు జూనియర్ బాలుర ఫైనల్లో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 12–10, 11–6, 8–11, 7–11, 11–9, 11–7తో వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై, పురుషుల ఫైనల్లో మొహమ్మద్ అలీ 5–11, 14–12, 11–8, 11–9, 13–15, 7–11, 15–13తో చంద్రచూడ్‌పై, యూత్ బాలుర ఫైనల్లో సరోజ్ సిరిల్ 8–11, 13–11, 11–5, 11–7, 8–11, 11–6తో లహోటి (హెచ్‌వీఎస్)పై, సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో అద్వైత్ 7–11, 11–7, 11–8, 11–9, 11–8తో వరుణ్ శంకర్‌పై నెగ్గి విజేతలుగా నిలిచారు. -
టెబుల్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు
విన్నర్లుగా నిలిచిన గౌతంకృష్ణ, శైలునూర్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజులుపాటు కొనసాగిన రాష్ట్రస్థాయి ప్రథమ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. బాలికల విభాగంలో విజయవాడకు చెందిన శైలు నూర్ బాషా 4–3 తేడాతో బీ నాగశ్రావణిపై విజయం సాధించింది. బాలుర విభాగంలో గుంటూరుకు చెందిన ఏ గౌతమ్‌కృష్ణ 4–2 తేడాతో ఏ. జగదీష్‌పై గెలుపొందాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఎల్వీఆర్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విజేతలు జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘ కార్యదర్శి ఎస్ఎం సుల్తాన్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి క్రీడల నిర్వహణకు ఎన్టీఆర్ స్టేడియం అనువుగా ఉందన్నారు. జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘ అధ్యక్షుడు ఎన్వీ గురుదత్తు మాట్లాడుతూ టోర్నమెంట్‌కు 13 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ అకాడమీ వ్యవస్థాపకుడు చెరుకూరి సత్యనారాయణ, శాప్ ఓఎస్డీ ప్రత్తిపాటి రామకృష్ణ, సీనియర్ రిఫరీ ముక్కామల, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి టి. సంపత్ కుమార్, ఏపీ టేబుల్ టెన్నిస్ సంఘ జీవితకాల అధ్యక్షుడు చెంచురామయ్య, జిల్లా టెన్నిస్ సంఘ కార్యదర్శి కడియాల ప్రవీణ్‌కృష్ణ, టెన్నిస్ సంఘ సభ్యులు పీ రామచంద్ర రావు, రామసీత, కృష్ణపాణి, సురేంద్ర, డిప్యూటీ రిఫరీ పీ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
టేబుల్ టెన్నిస్ గురువా.. గురివిందా?
టేబుల్ టెన్నిస్ పోటీల సందర్భంగా ఓ క్రీడాకారిణికి, టీటీ కోచ్‌కి మధ్య తీవ్ర పెనుగులాట జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ క్రీడాకారిణిని కోచ్ పట్టుకుని అసభ్యకరంగా లాగుతున్నట్లు హోటల్ సీసీటీవీ ఫుటేజిలో బయటపడింది. దాంతో ఇది తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఫలితంగా సదరు కోచ్‌ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఛత్తీస్‌గఢ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి కూడా రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇటీవల జరిగిన 76వ జాతీయ కేడెట్, సబ్ జూనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలకు తాను ఆ కోచ్‌ని పంపినట్లు ఆయన అంగీకరించారు. ఈ విషయం తమదృష్టికి కూడా వచ్చిందని, దీనిపై విచారణకు ఛత్తీస్‌గఢ్ టీటీ సంఘం ఓ త్రిసభ్య కమిటీని నియమించిందని భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య కార్యదర్శి ధనరాజ్ చౌదరి తెలిపారు. మూడు రోజుల్లో ఆ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. తానుకూడా ఆ వీడియో చూశానని, అయితే అందులో తనకేమీ అసభ్యత కనిపించలేదని ఆయన చెప్పారు. అలాగే, క్రీడాకారిణులు ఎవరూ దీనిపై తమకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మీడియా ద్వారానే స్థానిక సంఘం దృష్టికి ఈ విషయం తెలియడంతో వాళ్లు దీనిపై విచారణ జరిపిస్తున్నారన్నారు. కొందరు క్రీడాకారిణుల తండ్రుల వద్దకు ఈ వీడియో చేరడంతో వాళ్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఛత్తీస్‌గఢ్ నుంచి మొత్తం 16 మంది ఈ టోర్నీలో పాల్గొన్నారు.