
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణ పురుషుల, మహిళల జట్లు మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాయి. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో మంగళవారంతో లీగ్ దశ టీమ్ మ్యాచ్‌లు ముగిశాయి. గ్రూప్ ‘డి’లో తెలంగాణ పురుషుల జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఆరు పాయింట్లతో గ్రూప్ ‘టాపర్’గా నిలిచింది.
స్నేహిత్, మొహమ్మద్ అలీ, అమన్‌లతో కూడిన తెలంగాణ జట్టు తొలి మ్యాచ్‌లో 3–1తో ఉత్తరప్రదేశ్‌పై, రెండో మ్యాచ్‌లో 3–1తో హిమాచల్‌ప్రదేశ్‌పై, మూడో మ్యాచ్‌లో 3–0తో మేఘాలయపై గెలుపొందింది. మహిళల విభాగంలో గ్రూప్ ‘ఇ’లో వరుణి జైస్వాల్, గార్లపాటి ప్రణీత, మోనికా మనోహర్‌లతో కూడిన తెలంగాణ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి ఆరు పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ జట్టు వరుసగా 3–0తో రాజస్తాన్‌పై, 3–0తో హిమాచల్‌ప్రదేశ్‌పై, 3–0తో పాండిచ్చేరిపై గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment