
చెంగ్డూ (చైనా): ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ సత్యన్ జ్ఞానశేఖరన్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్ సత్యన్ 11–7, 8–11, 5–11, 9–11, 8–11తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, రెండుసార్లు ప్రపంచ కప్ చాంపియన్‌గా నిలిచిన టిమో బోల్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌ను నెగ్గిన సత్యన్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు. ‘మ్యాచ్ ముగిశాక చైనా ప్రేక్షకులందరూ చప్పట్లతో నన్ను అభినందించారు. ఈ దృశ్యం ఈ టోరీ్నలో నా ఆటతీరును చాటిచెప్పింది’ అని సత్యన్ వ్యాఖ్యానించాడు. ప్రిక్వార్టర్స్‌లో ఓడిన సత్యన్‌కు 7000 డాలర్ల (రూ. 5 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment