భారత్‌ విక్టరీ.. వాహనదారుల కోసం పోలీసుల సరికొత్త ఐడియా.. | Delhi Police Special Wishes To Team India | Sakshi
Sakshi News home page

భారత్‌ విజయం.. వాహనదారుల కోసం పోలీసుల సరికొత్త ఐడియా..

Jun 30 2024 11:30 AM | Updated on Jun 30 2024 11:30 AM

Delhi Police Special Wishes To Team India

ఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్‌లో విజేత నిలిచిన భారత జట్టును ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. టీమిండియా విజయం పట్ల అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టుకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదే సమయంలో టీమిండియా విజయంపై ఢిల్లీ పోలీసులు సరికొత్తగా ట్వీట్‌ చేశారు. టీమ్‌ విజయానికి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌కు లింక్‌ పెడుతూ ప్రతీ ఒక్కరిని ఆలోచించే విధంగా పోస్ట్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

 

కాగా, ఢిల్లీ పోలీసులు ట్విట్టర్‌ వేదికగా.. ‘మనమంతా భారత జట్టు మరో టీ20 వరల్డ్‌ కప్‌ గెలుపు కోసం 16 ఏండ్ల 9 నెలల 5 రోజులు (52 కోట్ల 70 లక్షల 40 వేల సెకన్లు) వేచిచూశాం. అదేవిధంగా ట్రాఫిక్‌ సిగల్స్‌ వద్ద కూడా ఓపికతో ఉందాం. మంచి క్షణాలు వేచి ఉండాల్సినవి. మరి మీరేమంటారు? టీమ్‌ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement