Ultimate TT League 2023- పుణే: మూడేళ్ల తర్వాత అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) లీగ్ నాలుగో సీజన్‌కు గురువారం(జూలై 13) తెర లేవనుంది. మొత్తం ఆరు జట్లు బరిలో ఉన్నాయి. చెన్నై లయన్స్, దబంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్, యు ముంబా, బెంగళూరు స్మాషర్స్, గోవా చాలెంజర్స్ ఈ లీగ్‌లో పాల్గొననున్నాయి. ఇక ఈనెల 30న ఫైనల్‌తో లీగ్ ముగుస్తుంది.
తెలంగాణ క్రీడాకారులు ఆకుల శ్రీజ దబంగ్ ఢిల్లీ తరఫున, సూరావజ్జుల స్నేహిత్ పుణేరి పల్టన్ తరఫున ఆడుతున్నారు. తొలిరోజు చెన్నై లయన్స్‌తో పుణేరి పల్టన్ తలపడుతుంది. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే మ్యాచ్‌లను స్పోర్ట్స్ 18 చానెల్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
జ్ఞానేశ్వరికి స్వర్ణ పతకం
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల 49 కేజీల విభాగంలో భారత ప్లేయర్ జ్ఞానేశ్వరి యాదవ్ స్వర్ణ పతకం సాధించింద. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జ్ఞానేశ్వరి మొత్తం 176 కేజీలు బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది.
గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్‌కే చెందిన జిలీ దలబెహెరా రజత పతకం గెలిచింది. మహిళల 45 కేజీల విభాగంలో కోమల్... పురుషుల 55 కేజీల విభాగంలో ముకుంద్ అహిర్ భారత్‌కు స్వర్ణ పతకాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment