
సింగపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’ బెర్త్‌కు విజయం దూరంలో నిలిచింది.
మంగళవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి మ్యాచ్‌లో జాతీయ చాంపియన్ శ్రీజ 11–5, 8–11, 11–8, 12–10తో చార్లోటి లుట్జ్ (ఫ్రాన్స్)పై గెలిచింది. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జూ చెన్‌హుయ్‌తో శ్రీజ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో శ్రీజ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment