
ఆకుల శ్రీజ (ఫైల్ ఫొటో)
World Table Tennis Championships: దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది మే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పోటీలకు మహిళల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా అర్హత పొందారు.
దోహాలో జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరి ఈ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్... పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో మనిక బత్రా–సత్యన్ కూడా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందారు.
ఇది కూడా చదవండి: బోపన్న, రామ్‌కుమార్ జోడీలు ఓటమి
అడిలైడ్ ఓపెన్ ఇంటర్నేషనల్–2 ఏటీపీ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)... రామ్‌కుమార్ (భారత్)–రేయస్ వరేలా (మెక్సికో) జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ బోపన్న–ఎబ్డెన్ 6–7 (4/7), 5–7తో నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)–టిమ్ ప్యూయెట్జ్ (జర్మనీ) చేతిలో... రామ్–వరేలా 3–6, 4–6తో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–రోజర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలయ్యారు.
చదవండి: Ind Vs NZ- Uppal: హైదరాబాద్‌లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని?
శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లకు ఛాన్స్.. ఎవరిపై వేటు..?
Comments
Please login to add a commentAdd a comment