
అనూప్ కుమార్‌కు కాంస్యం
ప్రపంచ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ స్కేటర్ అనూప్ కుమార్ యామ వరుసగా మూడోసారి ప్రపంచ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించాడు. స్పెయిన్‌లోని రియోస్ పట్టణంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో అనూప్ ఇన్‌లైన్ స్కేటింగ్ అంశంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో 2012లో కాంస్యం నెగ్గిన అనూప్ గత ఏడాది స్వర్ణాన్ని సాధించడం విశేషం. ఇటీవల జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో అనూప్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు గెలిచాడు.
అనూప్ కుమార్‌కు, కాంస్యం, ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్, Anup Kumar, bronze, artistic roller skating