ఇంచియోన్: ఆసియా గేమ్స్లో భారత మహిళా షూటర్లు మెరిశారు. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్ కాంస్యం సాధించింది. భారత షూటర్లు రాహి సర్నోబత్ (580), అనీసా సయ్యద్ (577), హీనా సిద్ధు (572) మొత్తం 1729 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా స్వర్ణం, చైనా రజత పతకాలు సొంతం చేసుకున్నాయి.