భారత్‌కు ఆరో స్థానం | India women lose in penalty shootout to finish 6th at Hawke's Bay Cup hockey | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఆరో స్థానం

Published Mon, Apr 11 2016 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

India women lose in penalty shootout to finish 6th at Hawke's Bay Cup hockey

హాస్టింగ్స్(న్యూజిలాండ్): హాక్స్‌బే కప్ అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 5-6 స్థానాల కోసం ఆదివారం జరిగిన వర్గీకరణ పోరులో భారత్ ‘పెనాల్టీ షూటౌట్’లో 3-4 గోల్స్ తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. తుదివరకు పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు 2-2 తో సమవుజ్జీలుగా నిలిచాయి.

దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులోనూ భారత క్రీడాకారిణులు విఫలమయ్యారు. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ 3-2తో జపాన్‌పై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement