
కబడ్డీ ఆట ఒక నిండుప్రాణం తీసింది. దాదాపు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసి చివరికి ఆగస్టు 15న ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని అరని టౌన్‌లో మరియమ్మన్ గుడి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇదే వేడుకల్లో కబడ్డీ పోటీలు నిర్వహించారు.
కాగా 34 ఏళ్ల వినోద్ కుమార్ మురట్టు కాలై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కూతకు వెళ్లే సమయంలో దొమ్మరిగడ్డ(Somersualt) వేసే ప్రయత్నంలో తప్పుడుగా ల్యాండ్ అయ్యాడు. దీంతో అతని తల భాగం నేలకు బలంగా తాకడంతో అక్కడే సృహ తప్పాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిగతా ఆటగాళ్లు, సిబ్బంది వచ్చి లేపినప్పటికి లాభం లేకుండా పోయింది. దీంతో వెంటనే ఆంబులెన్స్‌లో అరానీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే వినోద్ కుమార్ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వేలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వినోద్ కుమార్ తాజాగా భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ(ఆగస్టు 15న) ప్రాణాలు విడిచాడు. కాగా వినోద్ కుమార్‌కు భార్య శివగామి, సంతోష్, కలైరాసన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వినోద్ కుమార్ మృతితో అరనీలో విషాదచాయలు అలుముకున్నాయి.
கரணம் அடித்த போது திடிரென மயங்கி விழுந்த கபடி வீரர் உயிரிழப்பு#Aarani | #Kabaddi pic.twitter.com/Qx49VeJz4j
— News18 Tamil Nadu (@News18TamilNadu) August 16, 2022
చదవండి: ప్రజ్ఞానంద సంచలనం