Kabaddi Match
-
కబడ్డీ నింపిన విషాదం.. వారం రోజులు మృత్యువుతో పోరాడి
కబడ్డీ ఆట ఒక నిండుప్రాణం తీసింది. దాదాపు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసి చివరికి ఆగస్టు 15న ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని అరని టౌన్లో మరియమ్మన్ గుడి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇదే వేడుకల్లో కబడ్డీ పోటీలు నిర్వహించారు. కాగా 34 ఏళ్ల వినోద్ కుమార్ మురట్టు కాలై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కూతకు వెళ్లే సమయంలో దొమ్మరిగడ్డ(Somersualt) వేసే ప్రయత్నంలో తప్పుడుగా ల్యాండ్ అయ్యాడు. దీంతో అతని తల భాగం నేలకు బలంగా తాకడంతో అక్కడే సృహ తప్పాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిగతా ఆటగాళ్లు, సిబ్బంది వచ్చి లేపినప్పటికి లాభం లేకుండా పోయింది. దీంతో వెంటనే ఆంబులెన్స్‌లో అరానీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వినోద్ కుమార్ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వేలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వినోద్ కుమార్ తాజాగా భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ(ఆగస్టు 15న) ప్రాణాలు విడిచాడు. కాగా వినోద్ కుమార్‌కు భార్య శివగామి, సంతోష్, కలైరాసన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వినోద్ కుమార్ మృతితో అరనీలో విషాదచాయలు అలుముకున్నాయి. கரணம் அடித்த போது திடிரென மயங்கி விழுந்த கபடி வீரர் உயிரிழப்பு#Aarani | #Kabaddi pic.twitter.com/Qx49VeJz4j — News18 Tamil Nadu (@News18TamilNadu) August 16, 2022 చదవండి: ప్రజ్ఞానంద సంచలనం Anderson Peters: అథ్లెట్‌పై అమానుష దాడి.. వీడియో వైరల్ -
'భీమిలి కబడ్డీ జట్టు'ను గుర్తుచేస్తూ మృత్యు ఒడిలోకి.. వీడియో వైరల్
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు ఏరియాలో నిర్వహించిన కబడ్డీ పోటీలు విషాదం నింపాయి. పోటీల్లో పాల్గొన్న విమల్‌రాజ్ అనే యువకుడు లైవ్ మ్యాచ్‌లోనే ప్రాణాలు వదిలాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్ మధ్యలో విమల్‌రాజ్ కూతకి వెళ్లాడు. ప్రత్యర్థి ప్లేయర్లపై నుంచి ఎగిరి గీత దగ్గరికి వచ్చిన విమల్‌రాజ్‌ను ప్రత్యర్థి ప్లేయర్ మీద పడి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఆ ప్లేయర్ మోకాలు, విమల్‌రాజ్ ఛాతిపై బలంగా తగిలింది. విమల్‌రాజ్ గీత దాటడం, అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో సదరు ప్లేయర్ కూడా లైన్ బయట చేతులు పెట్టడంతో విమల్‌రాజ్‌కే పాయింట్ ఇస్తూ రిఫరీ విజిల్ విసిరాయి. ప్రత్యర్థి ప్లేయర్ తనపై నుంచి లేవగానే పైకి లేచేందుకు ప్రయత్నించిన విమల్‌రాజ్, లేస్తూనే కుప్పకూలిపోయాడు. వెంటనే మిగిలిన ఆటగాళ్లు, రిఫరీ వచ్చి లేపేందుకు ప్రయత్నించినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో వెంటనే అప్రమత్తమైన తోటి ప్లేయర్లు, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరే సమయానికే విమల్‌రాజ్ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. కబడ్డీ ఆడుతున్న సమయంలో గుండెపోటు రావడం వల్లే అతను చనిపోయి ఉండాడని ప్రాథమిక అంచనాకి వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నేచురల్ స్టార్ నాని నటించిన 'భీమిలీ కబడ్డీ జట్టు' సినిమా తరహాలోనే ఇక్కడ విమల్‌రాజ్ ప్రాణాలు వదలడం అందరిని కలిచివేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: భారత్‌కు భారీ షాక్.. కామన్వెల్త్ గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్! -
ప్రాణం తీసిన కబడ్డీ.. వీడియో వైరల్
రాయ్‌పూర్ : కబడ్డీ పోటీలు ఓ యువకుడి ప్రాణం తీశాయి. ఈ విషాద ఘటన చత్తీస్‌గడ్‌లోని ధమ్తారి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..జిల్లాలోని కోకాడి గ్రామంలో నివసించే 20 ఏళ్ల నరేంద్ర సాహు అనే యువకుడు స్థానికంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. ఆటలో కూతకు వెళ్లిన అతడిని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఒడిసిపట్టుకొని కింద పడేశారు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను మ్యాచ్ వీకక్షిస్తున్న ప్రేక్షకుడు ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. (వైరల్: పిచ్చెక్కినట్లుగా కొట్టుకున్న పులులు) హుటాహుటిన ఇతర ఆటగాళ్లు సాహుని ఆసుపత్రికి తరలించగా,అతడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాధమిక దర్యాప్తులో గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోందని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారి రామ్‌నరేష్ సెంగర్ వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో దాదాపు 12మందికి పైగా వాంగ్మాలాలను నమోదు చేసినట్లు చెప్పారు. (సీరం బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం: ఐదుగురు మృతి ) -
నాటు వేస్తూ.. కబడ్డీ ఆడుతూ..
హన్మకొండ చౌరస్తా: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఏబీవీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ మేరకు హన్మకొండలోని జిల్లా బస్టాండ్ వద్ద రోడ్డుపై గుంతల్లో నిలిచిన వర్షపు నీటిలో నాట్లు వేయడంతో పాటు ఆ నీటిలో కాసేపు కబడ్డీ ఆడారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పున్నం వేణుతో పాటు భరత్‌వీర్, అజయ్, వంశీకృష్ణ, అఖిల్, బలరాం, అరుణ్‌సాయి పాల్గొన్నారు ఏబీవీపీ నాయకులపై కేసు నమోదు.. వరంగల్ క్రైం: హన్మకొండ బస్టాండ్ వద్ద రోడ్డు మరమ్మతు చేయాలనే డిమాండ్‌తో నిరసన తెలిపిన ఏబీవీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు హన్మకొండ ఇన్స్పెక్టర్ దయాకర్ తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు కరోనా నిబంధనలకు ఉల్లంగించినందుకు పున్నం వేణు, ఎర్రగోల్ల భరత్, గాజు అజయ్‌కుమార్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
'ఫలితం ఏదైనా చివరి వరకు పోరాడు'
న్యూఢిల్లీ : ఆనంద్ మహీంద్ర.. ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు ఇది.. ప్రముఖ వ్యాపారవేత్త. నిత్యం వ్యాపార లావాదేవీలతో తలమునకలయ్యే ఈయన అప్పుడప్పుడు సోషల్ మీడియాపైనా ఓ కన్నేస్తుంటారు. ఈయనకు సినీ హీరోల రేంజ్లో సోషల్‌మీడియాలో కూడా లక్షల్లో అభిమానగణం ఉంది. ఆయన ఎప్పుడూ సోషల్ మీడియాలో సమకాలీన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆటలో అయినా జీవితంలో అయినా ఆఖరి నిమిషం వరకు పోరాడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఈ వీడియో ఓ కబడ్డీ మ్యాచ్‌కు సంబంధించినది. కూతకు వెళ్లిన ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్టు ఆటగాడ్ని అవుట్ చేసి లైన్ వద్దకు చేరుకుంటాడు. అయితే తన కోర్టులోకి వెళ్లకుండా ఇంకా అక్కడే ఉండి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొడతాడు. ఇంతలో అవుటైన ఆటగాడు అక్కడికి వచ్చి కవ్విస్తున్న ఆ రైడర్‌ను ఒక్కసారిగా తమ కోర్టు లోపలికి లాగడంతో అందరూ వచ్చి మూకుమ్మడిగా అతడ్ని పట్టుకోవడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్ర.. ప్రొకబడ్డీ లీగ్‌లో ఇలాంటి సీన్ చూడలేదంటూ కామెంట్ చేశారు. ఏదైనా చివరి వరకు పోరాడు అనే సందేశాన్ని ఇచ్చారు మహీంద్ర. పాయింట్ వచ్చేందుకు ఎలాంటి ఆస్కారం లేకపోగా, ప్రత్యర్థికి ఓ పాయింట్ కోల్పోయిన స్థితిలో కూడా పోరాటపటిమ ఉంటే ఎలాంటి ఫలితమైనా వస్తుందని సదరు ఆటగాడు నిరూపించాడు. Received this video with the following message: ‘Even in an adverse situation, one shouldn't give up till the last moment as it is possible to transform failure into success.’ Couldn’t agree more! And haven’t seen this stunt too often, even in #PKL! pic.twitter.com/Pdoqs9dakT — anand mahindra (@anandmahindra) November 15, 2019 -
బరువు పెరిగారు
ముంబైలో జరగనన్న కబడ్డీ మ్యాచ్‌కి వచ్చారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. వచ్చింది గెస్ట్‌గా కాదు. ప్లేయర్‌గా. కంగనా కథానాయికగా ‘బరేలీకి బర్ఫీ’ ఫేమ్ అశ్వనీ అయ్యర్ తివారి దర్శకత్వంలో ‘పంగా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారామె. పాత్ర కోసం కంగనా కాస్త బరువు పెరిగారు. ఈ సినిమా ముంబైషెడ్యూల్ శుక్రవారం మొదలైంది. ఈ షెడ్యూల్ పదిహేను రోజులు సాగుతుంది. ‘‘స్టూడెంట్‌గా ఉన్నప్పుడు కూడా నేను అథ్లెటిక్ పర్సన్‌ని కాదు. కానీ నాకు కబడ్డీ ఆట తెలుసు. కబడ్డీ ప్లేయర్స్ ఎలా ఉంటారు? వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? అనే విషయాలపై నాకు అవగాహన ఉంది. దర్శకుడు అశ్వనీ కోరుకున్నట్లుగా నేనీ సినిమా కోసం మారాను. నా నటన పట్ల ఆమె సంతృప్తిగా ఉన్నారు. అది నాకు హ్యాపీ’’ అన్నారు కంగనా రనౌత్. ‘పంగా’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
దక్షిణ కొరియాతో తెలంగాణ ఢీ
సాక్షి, హైదరాబాద్ : ఆసియా క్రీడలకు సన్నాహకంగా దక్షిణ కొరియా, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్ల మధ్య జరిగే స్నేహపూర్వక కబడ్డీ చాంపియన్‌షిప్ నేటి నుంచి జరుగనుంది. భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య, తెలంగాణ కబడ్డీ సంఘం సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి. బాచుపల్లిలోని కబడ్డీ అకాడమీలో పురుషులు, మహిళల విభాగంలో 19వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. నేటి సాయంత్రం 5 గంటలకు జరుగనున్న టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య సాంకేతిక డైరెక్టర్ ఇ. ప్రసాద్ రావు పాల్గొంటారు. ఇండోనేసియా రాజధాని జకార్తా వేదికగా ఆగస్టు–సెప్టెంబర్‌లో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. -
నరసాపురంలో కబడ్డీ పోటీలు ప్రారంభం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు గురువారం ప్రారంభమైనాయి. ఈ పోటీలను మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ పోటీల్లో 18 రాష్ట్రాల నుంచి 20 టీమ్‌లు పాల్గొంటున్నాయి. అయిదురోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్ పాల్గొన్నారు. -
కబడ్డీ మ్యాచ్ కోసం బాలీవుడ్ దిగ్గజాలు
బాలీవుడ్ తారలంతా ఒకచోట చేరారంటే సాధారణంగా అదేదో అవార్డుల కార్యక్రమం అయి ఉండాలి. కానీ ముంబైలో శనివారం ఓ కబడ్డీ మ్యాచ్ కోసం బాలీవుడ్ దిగ్గజాలంతా ఒక చోట చేరారు. ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభం సందర్భంగా అమితాబ్, షారూఖ్, ఆమీర్ ఖాన్, అభిషేక్, ఐశ్వర్యరాయ్, జయాబచ్చన్, క్రికెట్ దిగ్గజం సచిన్‌తో పాటు ఆయన భార్య అంజలీ, టీనా అంబానీ... ఇలా హేమాహేమీలంతా వచ్చారు. అన్నట్లు ఈ మ్యాచ్‌లో అభిషేక్ జట్టు జైపూర్ పాంథర్స్... ముంబై జట్టు చేతిలో ఓడిపోయింది.